Dwajasthambam
-
గణనాథుని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళవారం ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలకు అర్చకులు శేఖర్ గురుకుల్, వేదపండితులు సుబ్బారావు పూజలు చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషికపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ధ్వజస్తంభానికి క్షీర, చందన, ఇతర ద్రవాలతో అభిషేకం చేశారు. ఈ ఉత్సవాలకు ఉభయదారులుగా కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లె గ్రామాలకు చెందిన శీర్కరుణీక వంశస్తులు వ్యవహరించారు. సిద్ధి, బుద్ధి, వినాయక స్వామి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి పుర వీధులలో ఊరేగించారు. రాత్రి ఆలయాధికారులు ఉభయదారులు మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చి పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై ఆశీనులు చేయగా... స్వామివారు దానిపై విహరించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి వినాయకుడికి సోమవారం ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వ్రస్తాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చవితిరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితి. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఊరేగింపుగా పట్టువ్రస్తాలను తీసుకువెళ్లారు. వీరికి ఆలయ చైర్మన్, ఈవో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, ప్రసాదం, చిత్రపటం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. -
బంగారు కాంతులతో మెరిసిపోతున్న సింహాచల ఆలయ ధ్వజస్తంభం
-
ఒంటిమిట్టలో వేడుకగా ధ్వజారోహణ
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. తొలుత శాస్త్రోక్తంగా హోమం, పూజలు నిర్వహించిన వేదపండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభంపై గ రుడ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభానికి నవకళ పంచామృతాభిషే కం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో నటే‹Ùబాబు ఆధ్వర్యంలో సతీసమేతంగా రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె.హెచ్.రాజేష్ సంప్రదాయబద్ధంగా ఉత్సవాన్ని నిర్వహించారు. నేటి కార్యక్రమాలు: శ్రీకోదండరామాలయంలో శనివారం ఉదయం 7:30 గంటలకు వేణుగానాలంకారం ఉంటుంది. రాత్రికి కోదండరాముడు హంసవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించనున్నారు. -
మూలవిరాట్టు కన్నా ముందు మొక్కాల్సింది అక్కడే! నారేప ప్రత్యేకతే వేరు!
బుట్టాయగూడెం (పశ్చిమగోదావరి): దేవుడి దర్శనం కోసం భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి మొక్కుకున్నాకే గుడి లోపలకు వెళ్లి మూలవిరాట్టును దర్శించుకుంటారు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల తయారీకి ప్రకృతిలో ఎన్ని చెట్లు ఉన్నప్పటికీ అత్యధికంగా ఉపయోగిస్తున్నది మాత్రం నారేప చెట్టునే. ఈ చెట్టు బలంగా, ఎత్తుగా పెరగటమే కాకుండా కలప ఎన్నాళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడమే ఇందుకు కారణం. (చదవండి: నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్ చేసినందుకు..) వీటి ప్రత్యేకతే వేరు.. దేవాలయాల ఎదుట ప్రతిష్టించే ధ్వజస్తంభం తయారీకి సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు ఇంకొన్ని రకాల వృక్ష జాతులను కూడా వినియోగిస్తుంటారు. అయితే ఎక్కువగా వినియోగించేది మాత్రం నారేప చెట్లను, తర్వాత సోమి చెట్లనే. వృక్ష జాతుల్లో నారేపకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. నారేప చెట్ల కర్రలకు చెదలు పట్టవు. ఈ చెట్టు కర్రతో తయారుచేసిన ధ్వజస్తంభం దశాబ్దాల పాటు పటిష్టంగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం నారేప సొంతం. నారేప వృక్షం 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. ఈ చెట్లు దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గోదావరి పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా నారేప వృక్షాలు దర్శనమిస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కనూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా నారేప చెట్లు ఉన్నాయి. అరుదైన నారేప వృక్షజాతిని కాపాడేందుకు పశ్చిమ మన్యంలోని ఏపీ అటవీ శాఖ అధికారులు నర్సరీల్లో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో నర్సరీల ద్వారా వీటి పెంపకాన్ని చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నర్సరీల్లో నారేప మొక్కల పెంపకం చదవండి 👉🏼ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! 👉🏼 జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’