నాగోబా, సతీదేవతలకు పూజలు చేస్తున్న మెస్రం వంశానికి చెందిన కొత్త కోడళ్లు
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా సోమవారం అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబాకు అభిషేకం చేశారు. మహా పూజ నిర్వహించారు.
అనంతరం బస చేసిన గోవడ్ నుంచి సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకుని రాత్రి 1 గంట నుంచి మంగళవారం వేకువజాము 4 గంటల వరకు మెస్రం వంశంలోని 72 మంది కొత్త కోడళ్లకు బేటింగ్ (పరిచయ) కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు కొత్త కోడళ్లు నాగోబా ఆలయం పక్కనే ఉన్న సతీ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. బేటింగ్ అనంతరం కొత్త కోడళ్లు మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment