
శ్రీకాళహస్తిలో దిగంబరస్వామి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి బుధవారం నిత్యాగ్నిహోత్ర అవధూత హఠయోగేశ్వర మోని దిగంబర చటగోపి సూర్యప్రకాశనాథ కనకదుర్గాదేవి యోగేశ్వర శ్రీ సరస్వతీ స్వామి వచ్చారు. ఆయన స్వామి.. అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు.
ఇలా దిగంబరంగా దేవస్థానానికి విచ్చేసిన అవధూతలు చాలా అరుదు. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం బొగ్గులకొండ కూకట్లపల్లి గ్రామం. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తిలో దిగంబరం దర్శనానికి ఆయన దేవాదాయ శాఖ అనుమతి పొందినట్లు ఆలయంలో చర్చ జరుగుతోంది.