శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి నిర్వహించనున్నారు. ఆ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 2వ తేదీ బుధవారం కన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 3వ తేదీ గురువారం స్వామి, అమ్మవార్ల ధ్వజారోహణం, దేవరాత్రి, అంబారీ ఉత్సవం నిర్వహిస్తారు. 4వ తేదీ శుక్రవారం రెండో తిరునాళ్లు, భూతరాత్రి, భూతశుకవాహన సేవలు జరుగుతాయి. 5వ తేదీ శనివారం తిరునాళ్లు, గాంధర్వరాత్రి, రావణవాహన సేవలు నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆదివారం నాలుగో తిరునాళ్లు, నాగరాత్రి, శేషవాహన సేవ నిర్వహిస్తారు.
7వ తేదీ సోమవారం మహాశివరాత్రి రోజున నందిసేవ, లింగోద్భవం ఉత్సవాలు జరుగుతాయి. 8వ తేదీ వుంగళవారం రథోత్సవం, బ్రహ్మరాత్రి, తెప్పోత్సవం నిర్వహిస్తారు. 9వ తేదీ బుధవారం స్వామి,అమ్మమువార్ల కల్యాణోత్సవం, స్కంధరాత్రి, 10వ తేదీ గురువారం శ్రీసభాపతి కల్యాణం, ఆనంద రాత్రి, 11వ తేదీన శుక్రవారం కైలాసగిరి ప్రదక్షిణం, రుషిరాత్రి నిర్వహించనున్నారు. 12వ తేదీ శనివారం ధ్వజావరోహణం, దేవరాత్రి, 13వ తేదీ ఆదివారం పల్లకీసేవ నిర్వహిస్తారు. 14వ తేదీ సోమవారం ఏకాంతసేవ, మోహరాత్రి, 15వ తేదీ మంగళవారం శాంతి అభిషేకాలు, నిత్యోత్సవం నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Published Wed, Mar 2 2016 4:05 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement