
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. పర్యటన ముగించుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో ఓ యువకుడు రోడ్డుపై అర్జీతో కనిపించాడు. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్‌ను ఆపి సెక్యూరిటీ సిబ్బందిని అర్జీ తీసుకోమని పురమాయించారు.
వివరాల్లోకెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన మహేష్‌కి 2019లో యాక్సిడెంట్‌లో అంగ వైకల్యం కలిగింది. సీఎం జగన్ జిల్లా పర్యటనకు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సీఎం జగన్.. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై అర్జీతో నిల్చోవడంతో సీఎం జగన్ చూసి స్పందించారు. అయితే, అర్జీలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనను ఆదుకోవాలని అర్జీలో కోరినట్లు మహేష్ తెలిపారు.
చదవండి: (ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్)