
సాక్షి, చిత్తూరు : అనుమానం పెను భూతం అయింది. భార్య శిలాన్ని శంకించిన భర్త కిరాత కానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. భార్య దుర్గను భర్త వెంకటేష్ కత్తి తో దాడి చేసి కాళ్ళు,చేతులు నరికేశాడు. అంతంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ ఆరు నెలల క్రితం నెల్లూరు కు చెందిన దుర్గ ను వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో కత్తి తో దాడి చేశాడు. అనంతరం శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ దుర్గ ప్రస్తుతం నెల్లూరు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
(చదవండి : పరాయి వ్యక్తితో చనువుగా ఉంటోందని..)
Comments
Please login to add a commentAdd a comment