శ్రీకాళహస్తి ప్రధాన ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది
శ్రీకాళహస్తి(చిత్తూరు): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రధాన ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ గాలిగోపురం ప్రతిష్టాపన సందర్భంగా జనవరి 19 నుంచి 29వ తేదీ వరకు యాగం నిర్వహించారు. అయితే, ప్రధాన యాగశాల అలాగే ఉంది. ఇందులో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే యాగశాలతోపాటు అందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే, యాగానికి తమను పిలువలేదనే అక్కసుతో కొందరు నిప్పు పెట్టి ఉంటారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.