వైఎస్సార్ సీపీలో టీడీపీ నేతల చేరిక
శ్రీకాళహస్తి రూరల్ : మండలంలోని వేడాం గ్రామానికి చెందిన 37 మంది టీడీపీ నాయకులు మంగళవారం వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఒక మంచి పని చేయలేకపోయామని, అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని వైఎస్సార్‌సీపీలో చేరామని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో పెల్లూరు జానకయ్య, వేణుగోపాల్‌రెడ్డి, శంకరయ్య, దేవేంద్రరెడ్డి, మల్లికార్జునరెడ్డి, కామినేటి సుధాకర్, రమణయ్య, బాలసుబ్రమణ్యం, శివ, సురేష్, గోపి ఉన్నారు.