ముక్కోటి దేవతలకు ముక్కంటి ఆహ్వానం
కనుల పండువగా కన్నప్ప ధ్వజారోహణం
నేడు స్వామివారి ధ్వజారోహణం
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మాఘ బహుళ అష్టమి బుధవారం సాయంత్రం 4.30గంటలకు శ్రీకాళహస్తి కైలాసగిరుల్లో కన్నప్ప ధ్వజారోహణం కనుల పండువగా జరిగింది. బహ్మదేవుడి సారధ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దేవతలారా దిగిరండి.. దీవించండి.. అంటూ స్వామివారి తరఫున అర్చకులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు.
శ్రీకాళహస్తి: శివ భక్తుడైన కన్నప్పకు ఉత్సవాల్లో ప్రథమ పూజ అందేలా పరమశివుడు వరమిచ్చాడు. ఆ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో తొలిరోజున భక్తకన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శ్రీకాళహస్తి ఆలయంలో బుధవారం కన్నప్ప ధ్వజారోహణం నిర్వహించారు. ముక్కంటీశుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి మేళాతాళాలతో, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా కైలాసగిరి కొండపై ఉన్న భక్తకన్నప్ప ఆలయానికి తీసుకొచ్చా రు. ఈసందర్భంగా ఆలయానికి చెందిన వృషభం, వివిధ కళాబృందాలు ఊరేగింపులో పాల్గొన్నారు. కొండపై ఉన్న భక్తకన్నప్ప ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారుచేసిన పవిత్రదారాన్ని, వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. సంప్రదాయంగా నైవేద్యం సమర్పించి, దీపారాధన ఇవ్వడంతో ధ్వజారోహణం పూర్తయింది. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఉరేగించారు. భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాప్ చైర్మన్ పీఆర్‌మోహన్, వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, ఆలయు చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు, సభ్యులు, ఈవో భ్రవురాంబ, అధికారులు, ఉభయకర్తలు పాల్గొన్నారు.
దేవతలారా..దిగిరండి!
Published Thu, Mar 3 2016 2:33 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement