శ్రీకాళహస్తి: వైఎస్సార్ సీపీని అణగదొక్కడానికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. కోర్టులో హాజరుకావడానికి వస్తున్న మిథున్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
అధికారం శాశ్వతం కాదని, కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 40 ఏళ్లుగా రాజకీయల్లో ఉన్నారని, ఆయనను ఎదుర్కొలేక ఎలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చట్టాన్ని గౌరవించే పార్టీ అని స్పష్టం చేశారు. అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని వరప్రసాద్ అన్నారు.
'చట్టాన్ని గౌరవించే పార్టీ మాది'
Published Sun, Jan 17 2016 8:27 AM | Last Updated on Thu, Aug 9 2018 4:32 PM
Advertisement
Advertisement