చిత్తూరు : చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం రాత్రి నుంచి ఎడతేరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోవిందరాజు స్వామి ఆలయం రెండో సత్రంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే పలు నివాసాలలోకి వరద నీరు ప్రవేశించింది. తిరుమలలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో తిరుమాడ వీధులు జలమయమైనాయి. రెండో కనుమ రహదారిలో మరమ్మతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతిలోని కల్యాణి డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
అలాగే శ్రీకాళహస్తిలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. శ్రీకాళహస్తిశ్వీర ఆలయంలోని వరద నీరు ప్రవేశించింది. జిల్లాలోని స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.