అందుబాటులోకి సొరంగ మార్గం!
♦ తలుపులు తెరచిన శ్రీకాళహస్తి ఆలయ వర్గాలు
♦ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాడుకకు పరిశీలన
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు స్వామి, అవ్మువారి దర్శనానంతరం వెలుపలికి వెళ్లేందుకు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి సొరంగాన్ని వాడుకలోకి తీసుకురావాలని అధికారులు, ఆలయు సభ్యులు ప్రయుత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆలయు ఈవో భ్రవురాంబ, ఈఈ వెంకటనారాయుణ, సభ్యులు , తహశీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ వెంకటకిశోర్ సవుక్షంలో సొరంగం తలుపులు తెరిచారు.
50 అడుగుల దూరం ఉన్న సొరంగంలో ఆభరణాలు ఉంటాయునే ఉద్దేశంతో ఇబ్బందులు తలెత్తకుండా వుుందు జాగ్రత్తగా ఈవో అందరికీ సవూచారం ఇచ్చి తలుపులు తెరిపించారు. అందులో శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి పెద్ద పెద్ద పాత్రలు, కొయ్యులు, స్తంభాలు వూత్రమే ఉన్నాయి. ఆలయ పోటు పైభాగం మీదుగా కంచుగడప సమీపంలోని సెక్యూరిటీ పారుుంట్ వద్దకు సొర ంగం కలుస్తోంది. అక్కడ వెలుపలకు దారి కోసం ఆలయు గోడ నాలుగు అడుగులు తొలగించాల్సి వస్తోంది. అయితే ఎక్కడ పడితే అక్కడ ఆలయు గోడలు తొలగించడం ఆగవుశాస్త్ర విరుద్ధవుని నిపుణులు అంటున్నారు.