శాంతి మహాయజ్ఞంలో చిరంజీవి
శ్రీకాళహస్తి: చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తీశ‍్వరాలయానికి సమీపంలో నవయుగ నిర్మాణ సంస్థ నిర్మించిన రాజగోపురానికి మహాకుంబాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న విశ‍్వకల్యాణ శాంతి మహాయజ్ఞంలో సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ‘నవయుగ’ చైర్మన్ చింత విశ్వేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అభిమాన హీరో చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావచ్చారు. మొదట చిరంజీవి కుటుంబసభ్యులతో వెళ్లి శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీర్వసామిని దర్శించుకున్నారు.