చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లిలో శుక్రవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు.
శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లిలో శుక్రవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కూనాటి కాళప్ప కుమారుడు తులసి(10), మోడుబోయిన వెంకటరత్నం కుమారుడు గురుప్రసాద్(9) స్థానిక పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు.
కాగా శుక్రవారం సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత వారిద్దరూ కలసి వారి ఇళ్లకు సమీపంలో ఉండే చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ నీటితో నిండిన గుంతలో ఈతకొట్టేందుకు ప్రయత్నించి ఇద్దరూ జారి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వెతుకుతూ రాగా విగతజీవులై నీళ్లపై తేలియాడుతూ కనిపించారు.