చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నగరి వీధిలోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శోభ అనే మహిళ ఆదివారం మరణించింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శోభ మృతి చెందిందని వారు ఆరోపించారు. ఆ క్రమంలో ఆసుపత్రిపై దాడికి బాధితురాలి బంధువులు యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని... మృతురాలి బంధువులను సముదాయించేందుకు యత్నిస్తున్నారు.
మహిళ మృతి : ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
Published Sun, Feb 28 2016 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement
Advertisement