
శ్రీకాళహస్తిలో దర్శకరత్న ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి: మంచి కథ ఉన్న చిత్రాలు సైతం హిట్ కావడం లేదని దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చిత్రాలు తీయాలి... మంచి చిత్రాలు చూడాలని అటు దర్శకులకు... ఇటు ప్రేక్షకులకు సూచిస్తానని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం రాజకీయాలపై మాత్రం ఇప్పుడు స్పందించలేనని దాసరి తెలిపారు. అంతకుముందు దాసరి నారాయణరావు శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయంలోని గురుదక్షిణామూర్తి వద్ద ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతోపాటు స్వామి, అమ్మవార్లు చిత్రపటాలు అందజేశారు.తన భార్య దాసరి పద్మతో వచ్చి రాహు, కేతు నిర్వహించాలని భావించానని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని వెల్లడించారు.ఆ తర్వాత దేవాలయం వెలుపల విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దాసరి నారాయణరావుపై విధంగా సమాధానం చెప్పారు.
(శంకర్ సాక్షి టీవీ)