
కాళహస్తిలో సింధు రాహుకేతు పూజలు
శ్రీకాళహస్తి : రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పీవీ సింధు... ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆమెకు గురు దక్షిణమూర్తి మండపం వద్ద ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందచేశారు. సింధుతో పాటు బీజేపీ నేత, టీడీపీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు.