'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..' | Woman arrested after allegedly using ATM card belonging to missing SA mother Jody Meyers | Sakshi
Sakshi News home page

'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..'

Published Thu, Sep 24 2015 4:56 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..' - Sakshi

'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..'

ఆస్ట్రేలియా: కనిపించకుండా పోయిన ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రాచేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బహుశా ఆ యువతిని డబ్బు డ్రా చేసిన వ్యక్తే చంపేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన జోడీ మేయర్స్ అనే యువతి ఆగస్టు 26న కనిపించకుండా పోయింది. మరుసటి రోజే ఆ అమ్మాయికి చెందిన బ్యాంక్ ఎస్ఏ ఏటీఎం కార్డు ద్వారా మార్గరెట్ ఆర్చర్ (55) అనే మహిళ డబ్బులు డ్రా చేసింది.

అయితే, ఈ కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు గతవారం మేయర్స్ చాలా రోజు నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆమె చనిపోయి ఉందని తాము నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అలా చెప్పిన వారం తర్వాత తాజాగా మార్గరెట్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేయర్స్ ఆగస్టు 26న ఇంటి నుంచి బయలు దేరేముందు తన జీవిత భాగస్వామి నెయిల్ అర్చర్తో వెళ్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అతడిని అనుమానితుడిగా చేర్చడం లేదని పోలీసులు తెలిపారు. మున్ముందు దర్యాప్తులో ఏ మార్పు జరుగుతుందో చెప్పలేమని తెలిపారు. కాగా, మార్గరెట్ బెయిల్ తీసుకొని విడుదలైంది. తిరిగి ఈ నెల 30న ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement