నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు పట్టణంలో గత శుక్రవారం దారుణ హత్యకు గురైన వేముల రూప అనే గిరిజన బాలిక హత్యకేసును నూజివీడు పోలీసులు 24 గంటల్లో చేధించారు. రూప తల్లి పనిచేస్తున్న చోట పనిచేస్తున్న ఇస్లావత్ సీత అనే మహిళ ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. బాలిక తల్లి మరియమ్మ మీద వ్యక్తిగత కక్షతో ఈ హత్య చేసినట్లు సీత పోలీసుల వద్ద అంగీకరించింది. ముందుగా పథకం ప్రకారం మరియమ్మ పనిచేస్తున్న ఇటుక తయారీ ఫ్యాక్టరీలో పనికి చేరింది సీత. మృతురాలు రూప ఆ రోజు ఉదయం తన తల్లి మరియమ్మ దగ్గరకు వెళ్లింది.
రూపను తీసుకుని సీత బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వస్తాను తోడు పంపమని అడిగింది. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి బాలికను దారుణంగా చంపేసింది. నోట్లో మట్టిపోసి ఊపిరి ఆడకుండా చేసి, రూప గౌనును తీసి మెడకు బిగించి హత్య చేసింది. తిరిగి పనిలోకి వెళ్లి రూప ఆడుకోవడానికి వెళ్లినట్లు మరియమ్మకు చెప్పిందని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.
బాలిక హత్యకేసులో నిందితురాలు అరెస్ట్
Published Tue, May 24 2016 4:07 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement