
నిందితురాలితో పోలీసులు
నాగులుప్పలపాడు: భర్తను చంపేందుకు ఉద్దేశ పూర్వకంగా వేడి నూనె పోసిన భార్యను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ అజయ్‌బాబు కథనం ప్రకారం.. ఈదుమూడి గ్రామానికి చెందిన కొదమల సుధాకరరావు, ఏసుమ్మ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉధ్యోగం చేసే వారి కుమార్తె ఈ నెల 5వ తేదీన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడుతున్న తీరుకు మనస్తాపంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది.
ఇంకొల్లు బస్టాండ్‌లో ఉండి తండ్రి సుధాకరరావుకు ఫోన్ చేసి తాను హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పింది. కుమార్తె అలా వెళ్లడం నచ్చని తండ్రి భార్య ఏసుమ్మను ప్రశ్నించాడు. ఇదే విషయమై దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అంతా సర్దుకున్నాక నిద్రిస్తున్న భర్త సుధాకర్‌రావుపై భార్య ఏసుమ్మ బాగా కాగిన నూనె పోసింది. భర్తతో పాటు పక్కనే నిద్రిస్తున్న మరో కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఏసుమ్మపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment