ప్రయాణికురాలి నుంచి 70 కేజీల వెండి స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ నుంచి 70 కేజీల వెండిని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ఆమె లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె లగేజీలో భారీగా వెండి ఆభరణాలను కనుగొన్నారు. ఆ వెండి ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఆ మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.