silver seized
-
200 కిలోల వెండి పట్టివేత
బరంపురం : నగర శివారు అందపసరా రోడ్లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఒక కారుపై దాడి చేసి అక్రమంగా రవాణా చేస్తున్నా 200 కిలోల వెండిని, కారును స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ అధికారి కులమణి శెట్టి అందించిన సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అందపసరా రోడ్లో వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రవాణా చేస్తున్న వ్యక్తి కారులో తీసుకు వెళ్తున్న 200 కిలోల వెండికి సంబంధించి ఎటువంటి బిల్లులు చూపించలేక పోవడంతో వెండిని స్వాధీనం చేసుకుని అదుపులో తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బిల్లు చూపిన పక్షంలో తమ స్వాధీనంలో ఉన్న 200 కిలోల వెండిని విడుదల చేయనున్నట్లు ఐఐసీ కులమణిశెట్టి స్పష్టం చేశారు. స్టేషన్‌కు వచ్చిన సేల్‌టాక్స్ అధికారులు: సమాచారం అందుకున్న సేల్‌టాక్స్ అధికారుల బృందం మంగళవారం గుసానినువగాం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఐఐసీ అధికారి కులమణి శెట్టితో చర్చలు జరిపారు. పోలీసులు స్వాదీనం చేసుకున్న 200 కిలోల వెండిపై అరా తీశారు. -
దొంగ అరెస్ట్: భారీగా బంగారం స్వాధీనం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 23 కాసుల బంగారంతోపాటు 3 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి... కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు తమదైన శైలిలో దొంగను విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రయాణికురాలి నుంచి 70 కేజీల వెండి స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ నుంచి 70 కేజీల వెండిని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ఆమె లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె లగేజీలో భారీగా వెండి ఆభరణాలను కనుగొన్నారు. ఆ వెండి ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఆ మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కడపలో రూ. 13 లక్షలు స్వాధీనం
కడప నగరంలోని కోటిరెడ్ది సర్కిల్ వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ.13 లక్షల నగదుతోపాటు 20 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు వెండిని పోలీసులు సీజ్ చేసి కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదుపై పోలీసులు కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు వెల్లడించాడు. దాంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపుకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
అరకిలో బంగారం, రెండు కిలోల వెండి స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో బంగారం ఇంకా దొరుకుతూనే ఉంది. బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు తరలిస్తున్న బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని తానామిట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కారులో తరలిస్తున్న అరకిలో బంగారం, రెండు కిలోల వెండిని వారు గుర్తించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ప్రాంతానికి ఈ బంగారం, వెండిని ఎలాంటి బిల్లులు లేకుండా తెస్ఉతున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.