ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 23 కాసుల బంగారంతోపాటు 3 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించి... కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా పోలీసులు తమదైన శైలిలో దొంగను విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.