ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో బంగారం ఇంకా దొరుకుతూనే ఉంది. బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు తరలిస్తున్న బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని తానామిట్ట చెక్పోస్టు వద్ద పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ కారులో తరలిస్తున్న అరకిలో బంగారం, రెండు కిలోల వెండిని వారు గుర్తించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ప్రాంతానికి ఈ బంగారం, వెండిని ఎలాంటి బిల్లులు లేకుండా తెస్ఉతున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అరకిలో బంగారం, రెండు కిలోల వెండి స్వాధీనం
Published Wed, Apr 23 2014 8:43 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement