గుసానినువగా స్టేషన్‌లో ఐఐసి అధికారి కులమణి శెట్టితో చర్చలు జరుపుతున్న సేల్‌టాక్స్ అధికారులు
బరంపురం : నగర శివారు అందపసరా రోడ్‌లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఒక కారుపై దాడి చేసి అక్రమంగా రవాణా చేస్తున్నా 200 కిలోల వెండిని, కారును స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ అధికారి కులమణి శెట్టి అందించిన సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అందపసరా రోడ్‌లో వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
రవాణా చేస్తున్న వ్యక్తి కారులో తీసుకు వెళ్తున్న 200 కిలోల వెండికి సంబంధించి ఎటువంటి బిల్లులు చూపించలేక పోవడంతో వెండిని స్వాధీనం చేసుకుని అదుపులో తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బిల్లు చూపిన పక్షంలో తమ స్వాధీనంలో ఉన్న 200 కిలోల వెండిని విడుదల చేయనున్నట్లు ఐఐసీ కులమణిశెట్టి స్పష్టం చేశారు.
స్టేషన్‌కు వచ్చిన సేల్‌టాక్స్ అధికారులు:
సమాచారం అందుకున్న సేల్‌టాక్స్ అధికారుల బృందం మంగళవారం గుసానినువగాం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఐఐసీ అధికారి కులమణి శెట్టితో చర్చలు జరిపారు. పోలీసులు స్వాదీనం చేసుకున్న 200 కిలోల వెండిపై అరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment