సాక్షి, హొసూరు: కాలిగొలుసుకు పాలిష్ వేస్తానని మోసం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. కిష్టగిరి సమీపంలోని నాగర్‌కట్ట గ్రామానికి చెందిన వనిత(30) బుధవారం వీధిలో తిరుగుతూ పాలిస్ వేస్తానని చెబుతూ వెళ్లింది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన దీపిక తన కొడుకు కాలులోని గొలుసులకు పాలిష్ వేయమని ఇచ్చింది. అయితే పాలిష్ వేసిన తర్వాత గొలుసులు తక్కువ బరువు రావడంతో వనితను నిలదీసింది.
దీనికి సమాధానంగా ఆ మహిళ అంతే పాలిష్ వేస్తే బరువు తక్కువగానే వస్తుందని ఆమె బదులిచ్చింది. దీంతో దీపిక స్థానికుల సాయంతో వనితను బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వనితను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
పాలిష్ వేస్తానని మస్కా- మహిళ అరెస్ట్
Published Wed, Feb 7 2018 7:32 PM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment