ఆయింట్మెంట్ రాస్తూ నగలు కొట్టేసింది | Woman tries to pass off tomato for gold, arrested | Sakshi
Sakshi News home page

ఆయింట్మెంట్ రాస్తూ నగలు కొట్టేసింది

Published Mon, Jul 4 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ఆయింట్మెంట్ రాస్తూ నగలు కొట్టేసింది

ఆయింట్మెంట్ రాస్తూ నగలు కొట్టేసింది

చెన్నై: ఓ మహిళ మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి నగలు కాజేయాలనుకుంది. బంగారం బదులు టమోటా ఉంచి నగలు కొట్టేసేందుకు పథకం వేసింది. చివరకు ఆమె పన్నాగం వికటించి కటకటాలపాలైంది.

లక్ష్మి (35) అనే మహిళ.. పొన్నలూరు పెటాయ్లో ఓ ఇంట్లో ఒంటిరిగా ఉన్న ఇంద్రాణి (50) అనే ఆమెను కలసి, తనను నర్సుగా పరిచయం చేసుకుంది. తన దగ్గర సింగపూర్ నుంచి తీసుకువచ్చిన ఆయింట్మెంట్ ఉందని, అది నొప్పిని నయం చేస్తుందని ఇంద్రాణికి చెప్పింది. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఇంద్రాణి.. ఆయింట్మెంట్ రాయాల్సిందిగా లక్ష్మిని కోరింది. లక్ష్మి ఆయింట్మెంట్ రాస్తూ నగలు తీయాల్సిందిగా ఇంద్రాణికి చెప్పింది. ఇంద్రాణి నగలు తీసి చీర కొంగుకు కట్టుకుంది. కాసేపు కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వమని ఇంద్రాణికి లక్ష్మి చెప్పింది. లక్ష్మి ఈ సమయంలో ఇంద్రాణి చీరకొంగు విప్పి నగలు తీసుకుని, వాటికి బదులుగా టామోటా ఉంచింది. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి అల్మరా పగలగొట్టి అందులో ఉన్న 19 వేల రూపాయల నగదు తీసుకుంది. లక్ష్మి ఇంట్లోంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, ఇంద్రాణి విషయం గమనించి అలారమ్ మోగించింది. చుట్టుపక్కలవాళ్లు వచ్చి లక్ష్మిని బంధించి పోలీసులకు అప్పగించారు. లక్ష్మి గతంలోనూ ఇలాగే చోరీలకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement