మీరట్: ఓ క్రిమినల్ కేసులో తన సోదరుడికి కోర్టు జైలు శిక్ష విధించడంతో ఓ మహిళ తీర్పు చెప్పిన న్యాయమూర్తిని దూషిస్తూ, ఆయన ఛాంబర్లో వీరంగం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ కోర్టు ఆవరణంలో ఈ ఘటన జరిగింది.
ఓ క్రిమినల్ కేసులో అనిత అనే మహిళ సోదరుడితో పాటు ఇతర నిందితులను ఇటీవల కోర్టు దోషులుగా ప్రకటించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం అనిత మీరట్ అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిని కలిసేందుకు వచ్చింది. జడ్జి ఛాంబర్లోకి అనుమతిలేకుండా వెళ్లిన అనిత జడ్జిని కలవాలని సిబ్బందిని కోరింది. ఓ పేపర్పై తన పేరు రాసి విశ్రాంతి గదిలో జడ్జిని కలిసింది. తన సోదరుడికి శిక్ష వేసినందుకు జడ్జిని దూషిస్తూ, వాటర్ బాటిల్ను విసిరేసింది. టేబుల్పై ఉన్ గ్లాసును పగలగొట్టింది. అనితను అడ్డుకునేందుకు వచ్చిన ఓ మహిళ కానిస్టేబుల్పై చైర్ విసరడంతో ఆమె గాయపడింది. అనితపై కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి ఏకే రాణె చెప్పారు.
జడ్జి శిక్ష వేశారని.. దోషి సోదరి వీరంగం
Published Tue, Jul 26 2016 4:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
Advertisement