పోలీసులకు ఫోన్ కాల్స్ చేసినందుకు జపాన్లో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ మాత్రానికే జైల్లో పెడతారా అని ఆశ్చర్యపోవచ్చు. అయితే ఫోన్ చేయడమంటే అలా ఇలా కాదు.. ఆరు నెలల వ్యవధిలోనే పోలీసులకు 15 వేల ఫోన్ కాల్స్కు చేసిందట. ఇక ఓ రోజయితే ఏకంగా 927 సార్లు ఎమర్జన్సీ కాల్స్ చేసిందట. తమ విధులకు పదేపదే ఆటంకం కలిగిస్తుండటంతో విసుగెత్తిపోయిన పోలీసులు ఆ మహిళను ఆరెస్ట్ చేశారు.
జపాన్లోని సాకాయ్ సిటీలో ఈ సంఘటన జరిగింది. 44 మహిళ గత మే నుంచి ఫోన్ తతంగం మొదలు పెట్టింది. మధ్యలో పోలీసులు ఆమెను కలసి తమ విధులకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరించారు. అందులోనూ ఒకసారో రెండుసార్లో కాదు 60 సార్లు ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అయినా ఆమె ధోరణి మార్చుకోకపోవడంతో అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆమె ఫోన్ చేసేందుకు తగిన కారణమంటూ లేదని పోలీసులు తెలిపారు. ఆమెకు మానసిక సమస్య లేకపోవచ్చని తెలిపారు. మూడేళ్ల జైలు శిక్ష లేదా భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశముందని తెలిపారు.
6 నెలల్లో 15 వేల కాల్స్.. మహిళ అరెస్ట్
Published Thu, Dec 5 2013 3:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement