బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును న్యూఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ కేసులో సోనమ్ ఇంట్లో పనిచేసే ఓ మహిళ, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ కపూర్ అత్త కేర్ టేకర్‌గా పనిచేస్తున్న అపర్ణ రూతు విల్సన్ అనే నర్సు ఈ దొంగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ అమృత షెర్గిల్ మార్గ్ నివాసంలో జరిగిన ఈ ఘటనలో నర్సు ఆమె భర్త సుమారు రూ. 2.41 కోట్ల విలువైన నగలు, డబ్బును దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది
పోలీసుల వివరాల ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా తల్లిని చూసుకునేందుకు కేర్ టేకర్‌గా అపర్ణ రూతు విల్సన్ అనే నర్సును నియమించారు. అపర్ణ భర్త నరేశ్ కుమార్ సాగర్ శంకర్పూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై అదే నెల 23న సోనమ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆహుజా ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ పోలీసులు విచారించారు.
చదవండి: వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్
అలాగే మంగళవారం రాత్రి సరితా విహార్‌లోని అపర్ణ ఇంట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు జరపగా అసలు విషయం బయటపడింది. దీంతో అపర్ణతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత మార్చిలోనే సోనమ్ మామయ్య, ఆమె భర్త ఆనంద్ ఆహుజా తండ్రి హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీకి సైబర్ నేరస్థులు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment