టాపర్స్ స్కాం.. కీలక పురోగతి | Topper scam: Arrest warrant issued against ex-BSEB chief and JD(U) MLA | Sakshi

టాపర్స్ స్కాం.. కీలక పురోగతి

Published Wed, Jun 15 2016 8:06 PM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM

టాపర్స్ స్కాం.. కీలక పురోగతి - Sakshi

టాపర్స్ స్కాం.. కీలక పురోగతి

పాట్నా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ఇంటర్మీడియట్ టాపర్స్ స్కాంలో విచారణ వేగంగా జరుగుతుంది. ఈ స్కాంతో సంబంధం ఉన్న బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు(బీఎస్ఈబీ) చైర్మన్ లాల్ కేశ్వర్ సింగ్, ఆయన భార్య అయిన జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాలపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పోలీసుల కోరిన ప్రకారం పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఓమ్ ప్రకాశ్ బుధవారం భార్యాభర్తలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు ప్రకటించారు. అవినీతి అరోపణలు రావడంతో జూనియర్ ప్రొఫేసర్ దిలీప్ కుమార్ వర్మను ప్రిన్సిపాల్ గా నియమించిన విషయం తెలిసిందే.

మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్  చేయటం విశేషం. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం పాట్నాలోని గంగా దేవి మహిళా కాలేజీ పరిధిలో సోదాలు నిర్వహించారు. అక్రమ మార్గంలో సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులు.. సర్టిఫికేట్కు రూ. 5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. టాపర్స్ స్కాంలో ఇప్పటికే కొందరు టాపర్స్ ను,  మరో కీలకమైన వ్యక్తి, విషున్ రాయ్ కాలేజ్ డైరెక్టర్ బచ్చన్ రాయ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement