usha sinha
-
టాపర్స్ స్కాం.. కీలక పురోగతి
పాట్నా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ఇంటర్మీడియట్ టాపర్స్ స్కాంలో విచారణ వేగంగా జరుగుతుంది. ఈ స్కాంతో సంబంధం ఉన్న బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు(బీఎస్ఈబీ) చైర్మన్ లాల్ కేశ్వర్ సింగ్, ఆయన భార్య అయిన జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాలపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పోలీసుల కోరిన ప్రకారం పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఓమ్ ప్రకాశ్ బుధవారం భార్యాభర్తలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు ప్రకటించారు. అవినీతి అరోపణలు రావడంతో జూనియర్ ప్రొఫేసర్ దిలీప్ కుమార్ వర్మను ప్రిన్సిపాల్ గా నియమించిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం పాట్నాలోని గంగా దేవి మహిళా కాలేజీ పరిధిలో సోదాలు నిర్వహించారు. అక్రమ మార్గంలో సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులు.. సర్టిఫికేట్కు రూ. 5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. టాపర్స్ స్కాంలో ఇప్పటికే కొందరు టాపర్స్ ను, మరో కీలకమైన వ్యక్తి, విషున్ రాయ్ కాలేజ్ డైరెక్టర్ బచ్చన్ రాయ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
బిహార్ టాపర్స్ స్కాంలో మరో సంచలనం!
పాట్నా: బిహార్ టాపర్స్ స్కాం వరుసలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. జేడీయూ మాజీ మహిళా ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో అత్యంత దారుణమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం. అంతేకాదు అవధ్ యూనివర్సిటీ నుంచి 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు ఆమె సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనగా.. యూనివర్సిటీ ప్రారంభమైందే 1976లో. అయినా రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఒకే ఏడాదిలో ఎలా కంప్లీట్ చేశారు అనే విషయం అంతుచిక్కడం లేదు. ఉషా సిన్హా తన పీహెచ్‌డీని సైతం 23 ఏటా పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొనడం చూసి ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఆమె పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో హిందీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. టాపర్స్ స్కామ్‌లో ఉషా సిన్హా పేరు కూడా వినిపిస్తోంది. ఈమె భర్త లోకేశ్వర్ ప్రసాద్ గతంలో బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు.