![Tiruvallur police Arrested A Man From Tamil Nadu For Allegedly Extorting Rs 50 Lakh - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/24/Fake-Documents.jpg.webp?itok=XUCymb8Q)
సాక్షి, తిరువళ్లూరు(చెన్నై): తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 74 మంది వద్ద రూ.50 లక్షలు వసూలు చేసి మోసం చేసినందుకు తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ రబ్బర్‌స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మేడవాక్కం ప్రాంతానికి చెందిన రంగన్ కుమారుడు బాలాజీ (36) హోమ్ హెల్త్‌కేర్ వెబ్‌సైట్ నిర్వహిస్తున్నాడు. తిరువళ్లూరు జిల్లా అమ్మయార్‌కుప్పానికి చెందిన జయకాంతన్ కుమారుడు వెంకటాచలం సంప్రదించి తనకు ఉద్యోగం కావాలని కోరాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని నకలీ అపాయింట్‌మెంట్ అర్డర్‌ను ఇచ్చాడు. నకిలీవని తెలియడంతో గురువారం తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బాలాజీ ఇప్పటి వరకు 18 మందికి రైల్వే ఉద్యోగం, 54 మందికి ఈఎస్‌ఐ వైద్యశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. శుక్రవారం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment