cheating cases
-
రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్..
Youtuber Karthik Gopi Nath Arrested For Cheating Rs 44 Lakh: ఆలయాల పునరుద్ధరణ పేరుతో రూ. 44 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన యూట్యూబర్, బీజేపీ మద్దతుదారుడు కార్తీక్ గోపీనాథ్‌ను ఆవడి పోలీసులు సోమవారం (మే 30) అరెస్టు చేశారు. ఆవడిలో స్టూడియాతోపాటుగా యూట్యూబ్ చానల్‌ను కార్తీక్ నడుపుతున్నాడు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కార్తీక్‌పై దేవదాయ శాఖ కన్నెర్ర చేసింది. పెరంబలూరులో రెండు ఆలయాల పునరుద్ధరణ కోసం అంటూ.. కార్తీక్ విరాళాల్ని సేకరించాడు. ఇందులో ఒకటైన మదుర కాళి అమ్మన్ ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉంది. కాగా అనుమతి లేకుండా వసూళ్లకు పాల్పడినందుకు సంబంధిత అధికారులు ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు రూ. 44 లక్షల మేరకు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో కార్తీక్‌ను అరెస్టు చేశారు. అంబత్తూరు కోర్టు అతనికి జూన్ 13 వరకు రిమాండ్‌కు విధించింది. చదవండి:👇 తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జగత్ కిలాడీలకు ఝలక్
సాక్షి హైదరాబాద్: దేశ, విదేశీ పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ.. మూడేళ్లుగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుదారులను మోసం చేస్తున్న అంతర్జాతీయ నేరస్తులను సైబరాబా ద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్‌తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మూడు కాల్ సెంటర్ల ఏర్పాటు ఐటీలో విశేష అనుభవం ఉన్న న్యూఢిల్లీకి చెందిన నవీన్ భూటానీ 2017లో ఆర్‌ఎన్‌టెక్ సర్వీసెస్ కంపెనీని ఏర్పాటు చేసి.. విదేశీ కస్టమర్లకు సాంకేతిక సేవల ను అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన మోహిత్ కుమార్, మోను సింగ్‌లతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీ సేవల పేరుతో విదేశీ కస్టమర్లను మోసం చేయాలని నిర్ణయించుకొని ఢిల్లీలోని జనక్‌పురి, ఘజియాబాద్‌లోని కోశాంబి, పంజాబ్‌లోని మొహాలీలో మూడు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 80 మంది టెలీకాలర్లను నియమించుకున్నారు. అమెజాన్, పేపాల్ వంటి ఈ– కామర్స్ సైట్లలో నమోదయిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల వివరాలను సేకరించారు. ‘మీరు ఫలానా రోజున ఆన్లైన్ షాపింగ్ చేశారు. మీ ఖాతా నుంచి సొమ్ము కట్ అయింది. మీరు సంబంధిత లావాదేవీలు జరపకపోతే కింద ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండని’ నకిలీ మెసేజ్‌లు, ఈ– మెయిల్స్ పంపించారు. మరికొందరికి మీ కంప్యూటర్, రూటర్, ఇంటర్నెట్ సాంకేతిక పరికరాలలో సమస్యలు వచ్చాయని పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కస్టమర్లు స్పందించగానే.. టెలీ కాలర్లు కాల్ రిసీవ్ చేసుకొని మోసానికి తెరలేపేవారు. ఎలక్ట్రానిక్స్‌ను హ్యాకింగ్ చేసి.. క్రెడిట్ కార్డ్ నంబర్, సీవీవీ, ఎక్స్పైరీ తేదీ, పిన్, పేరు ఇతరత్రా వివరాలను తస్కరించారు. వీటి సహాయంతో లావాదేవీలు నిర్వహించేందుకు నలుగురు హైదరాబాదీలతో చేతులు కలిపారు. ఇలా ఇప్పటివరకు సాంకేతిక సేవల ముసుగులో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్దారులను రూ.25 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ∙అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ జీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు.. న్యూఢిల్లీకి చెందిన నవీన్ భూటానీ, మోహిత్, మోను, హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ, దొంతుల శ్రవణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్ వెన్నెలకంటిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.11,40,000 నగదుతో పాటు మూ డు వాహనాలు, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, 12 సెల్ఫోన్లు, 10 సీపీయూలు, 6 రబ్బర్ స్టాంప్‌లు, 16 చెక్కుబుక్‌లు, 18 డెబిట్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా బయటపడింది.. హైదరాబాద్‌లోని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ యూనిట్ ప్రతినిధి అబ్దుల్ నయీమ్.. బ్యాంక్ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నప్పుడు హెచ్డీఎఫ్సీ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్లో రూ.64.40 లక్షల అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ, ఆర్బీఎల్, యాక్సెస్ బ్యాంక్‌లకు గత ఆరు నెలల్లో రూ.50 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. కొట్టేసిన మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ఘరానా సైబర్ నేరగాళ్లు దుబాయ్‌లో కూడా రూ.20 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న దుబాయ్‌కు చెందిన అర్షద్, అమీర్, డాక్టర్ ఫహద్‌లను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే.. హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ అలియాస్ రాజు, దొంతుల శ్రవణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్ వెన్నెలకంటి మాదాపూర్ పోలీస్‌స్టేషన్ వెనకాలే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. టెలీ కాలర్లు తస్కరించిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల వివరాలతో షాపింగ్ చేయడం కోసం మర్చంట్ సైట్లను అభివృద్ధి చేశారు. వీటికి సొంత బ్యాంక్ ఖాతాలతో పేమెంట్ గేట్వేలను అనుసంధానించారు. దీంతో మోసపూరిత క్రెడిట్ కార్డ్‌లతో వాళ్ల వెబ్సైట్లలో లావాదేవీలు జరపగానే ఆ సొమ్ము వాళ్ల ఖాతాలోనే జమ అయ్యే -
ఇళ్లు కొనుగోలు పేరుతో రూ.8 లక్షలు కాజేసి వ్యక్తి పరార్!
పాయకాపురం(విజయవాడరూరల్): ఇంటి కొనుగోలు పేరుతో డబ్బులు తీసుకొని పరారైన వ్యక్తిపై నున్న పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. శాంతినగర్‌లో నివసించే కసుకుర్తి అనంతలక్ష్మి టైలర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్. వీరి ఇంట్లో అద్దెకుండే కుడుముల పాండురంగారావు అనే వ్యక్తి ఇల్లు కొనాలని అనంతక్ష్మి వద్ద రూ.8 లక్షల 60 వేలు తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చి నెల రోజులు గడిచినా తిరిగి చెల్లించకపోవడంతో దంపతులు నిలదీశారు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాండురంగారావు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్టు.... నున్న గ్రామం గొల్లవాని కుంట వద్ద పేకాడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ.1960 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. గాయపర్చిన వ్యక్తి పై కేసు.... చికెన్ పకోడి తింటున్న వ్యక్తి పిలిచిన వెంటనే రాలేదని కోపం వచ్చిన మరో వ్యక్తి రాయితో గాయపర్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. పైపులరోడ్డు సెంటర్లో ఆటోలకు టేప్ రికార్డులను బిగించే పనిచేసుకుంటున్న షేక్ ఖాదర్ 4వ తేదీన ఓ బండి వద్ద చికెన్ పకోడి తింటున్నాడు. మణి అనే వ్యక్తి ఖాదర్‌ను పిలిచి ఏంట్రా పిలిచిన వెంటనే రావేంటని రాయితో తల పై మోదాడు. గాయమైన ఖాదర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు మణిపై కేసు నమోదు చేశారు. చదవండి: Inspirational Story: 26 ఏళ్ల కొడుకును వీపుపై మోస్తూ ప్రపంచ పర్యటన చేస్తున్న తల్లి! -
బోనాల పండగలో పరిచయం.. ఫోన్ కాల్స్.. శారీరకంగా లొంగదీసుకోని
సాక్షి, తూప్రాన్(మెదక్): పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం యావపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి 2019లో పదో తరగతి చదివి ఇంటి వద్దనే ఉంటోంది. సెప్టెంబర్‌లో యావపూర్‌లో నిర్వహించిన బోనాల పండగకు తూప్రాన్‌కు చెందిన ఏర్పుల నరేంద్ర తన ఇద్దరి స్నేహితులతో ఇంటికి వచ్చాడు. ఆ పరిచయంతో తన సెల్‌ఫోన్ నంబరు తీసుకొని పలుమార్లు ఫోన్‌చేసి మాట్లాడాడు. అదేనెల 26న తల్లి కూలీ పనులకు వెళ్లిన సమయంలో నరేంద్ర ఇంటికి వచ్చి బలవంతంగా శరీరకంగా లొంగదీసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం ఎవరితోనైన చెబితే చంపేస్తానని బెదిరించినట్లు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరంగా లొంగతీసుకున్నాడంది. కడుపులో నొప్పిగా ఉండటంతో తన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా రెండు నెలల గర్భవతని వైద్యులు తెలిపారన్నారు. ఈ విషయంపై నరేంద్రను నిలదీస్తే పెళ్లి చేసుకోనని, నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అని బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పటికే నరేంద్రకు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఉద్యోగాల పేరిట మోసం.. నకిలీ అపాయింట్మెంట్ అర్డర్ రచ్చ!
సాక్షి, తిరువళ్లూరు(చెన్నై): తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 74 మంది వద్ద రూ.50 లక్షలు వసూలు చేసి మోసం చేసినందుకు తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ రబ్బర్‌స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మేడవాక్కం ప్రాంతానికి చెందిన రంగన్ కుమారుడు బాలాజీ (36) హోమ్ హెల్త్‌కేర్ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. తిరువళ్లూరు జిల్లా అమ్మయార్‌కుప్పానికి చెందిన జయకాంతన్ కుమారుడు వెంకటాచలం సంప్రదించి తనకు ఉద్యోగం కావాలని కోరాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని నకలీ అపాయింట్మెంట్ అర్డర్‌ను ఇచ్చాడు. నకిలీవని తెలియడంతో గురువారం తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బాలాజీ ఇప్పటి వరకు 18 మందికి రైల్వే ఉద్యోగం, 54 మందికి ఈఎస్ఐ వైద్యశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. శుక్రవారం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
లక్షలు దండుకున్న టీడీపీ నాయకుడు..చీటింగ్ కేసు నమోదు
సాక్షి,కర్నూలు: బనగానపల్లె మార్కెట్ యార్డు మాజీచైర్మన్, టీడీపీ నాయకుడు కోడి నాగరాజు యాదవ్‌పై బనగానపల్లె పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బనగానపల్లె మండలం బత్తులూరుపాడుకు చెందిన పసుపుల మధుసూదన్‌రెడ్డి, సోముల ప్రసాద్‌రెడ్డి బావ, బావమరుదులు. వీరు హైదరాబాద్‌లో ఉంటారు. తెలంగాణ ప్రభుత్వంలో వీరికి మంచి పలుకుబడి ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తారని కోడి నాగరాజు యాదవ్ బనగానపల్లెకు చెందిన షేక్ అర్షద్ బాషా సోదరులను పరిచయం చేయించారు. షేక్ అర్షద్‌బాషా హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తమ్ముడు అబిద్‌బాషా కూడా హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కోడి నాగరాజు యాదవ్ చెప్పిన మాటలు నమ్మి పసుపుల మధుసూదన్‌రెడ్డి ఖాతాలో రూ. 10.60 లక్షలు, సోముల ప్రసాద్‌రెడ్డి ఖాతాల్లో రూ.లక్ష జమ చేశారు. కాగా ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వక పోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో ఇంకా ఎంతమందితో ఇలా డబ్బులు వసూలు చేశారనే కోణంలో విచారిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంతమంది నిరుద్యోగ యువకుల నుంచి భారీ మొత్తంలో వారు డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు : ఎస్పీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మంచి అవకాశమంటూ కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువతకు ఎస్పీ సూచించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసపోయింటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. బనగానెపల్లె మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ కోడి నాగరాజుయాదవ్తో పాటు మరో ఇద్దరిపై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
బెజవాడలో మాయలేడీ మోసాలు
-
ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై నమోదైన కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. 19వ స్టేట్ లెవల్ కో– ఆర్డినేషన్ కమిటీ వర్చువల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వారి కార్యాలయంలో గురువారం జరిగింది. తొలుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ, 19వ స్టేట్ లెవల్ కో– ఆర్డినేషన్ కమిటీ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 29న జరిగిన 18వ స్టేట్ లెవల్ కో– ఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన పలు సంస్థలపై నమోదైన కేసుల వివరాలు ఏయే దశల్లో ఉన్నాయో ఆరా తీశారు. ప్రజల కష్టాన్ని దోచుకునే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ►మోసాలకు పాల్పడక ముందే, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉన్నాయా? సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు ఉన్నాయా....లేదా? అనే విషయాలు గుర్తించాలన్నారు. ►అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్, అభయ్ గోల్డ్, హీరా గ్రూప్, సహారా సహా పలు సంస్థలపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలను సీఎస్ కు సీఐడీ, పోలీస్ అధికారులు వివరించారు. ►ఎక్కువ కేసులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నమోదవుతున్నట్లు సీఎస్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ►ఎక్కువ వడ్డీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న ఆర్థిక సంస్థలపై నమోదైన కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి, బాధితులకు న్యాయమందించాలని సీఎస్ ఆదేశించారు. ►సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, సీఐడీ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలకు మత్తుమందు ఇచ్చి..
విజయనగరం క్రైమ్: ఒంటరి మహిళలను టార్గెట్ చేయడం... మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన డ్రింక్స్ తాగించడం.. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో ఉడాయించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. దొంగిలించిన సొత్తును బ్యాంక్‌ల్లో తనఖా పెట్టి జల్సా చేయడం అతని అలవాటు. అటువంటి వ్యక్తిని.. అతనికి సహకరించిన మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ రాజకుమారి స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామానికి చెందిన కొట్టిస లకు‡్ష్మన్నాయుడు రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఒంటరిగా ప్రయాణించే మహిళలతో మాటలు కలిపేవాడు. ఈ క్రమంలో వారి ఫోన్ నంబర్లు తీసుకుని వారితో నిత్యం ఫోన్లో మాట్లాడేవాడు. వారితో పరిచయాలు పెంచుకుని ఆయా ఊళ్లకు వెళ్లేవాడు. బస్టాండ్ దగ్గర ఉన్నానని.. పలానా హోటల్ వద్ద ఉన్నానని పరిచయం ఉన్న మహిళలను రప్పించుకుని వారికి మత్తుమందు కలిపిన డ్రింక్‌లు ఇచ్చేవాడు. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో పాటు బ్యాగుల్లో ఉన్న నగదుతో ఉడాయించేవాడు. అనంతరం తన సహచరుడైన పాయకరావుపేటకు చెందిన తోట ప్రసాద్ సహాయంతో బంగారు ఆభరణాలను మత్తూట్, మణప్పరం, ఐఐఎఫ్ఎల్ వంటి ప్రైవేట్ సంస్థల్లో తనాఖా పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. ఇటీవల పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన ఎస్పీ రాజకుమారి నిందితుడ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశిస్తూ సీసీఎస్ పోలీసులను ఆదేశించారు. దీంతో సీసీఎస్ పోలీసులు నెల రోజులుగా విచారణ చేపడుతూ ఎట్టకేలకు నిందితుడు లకు‡్ష్మనాయుడుతో పాటు అతనికి సహకరిస్తున్న తోట ప్రసాద్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు 22 నేరాలు చేసినట్లు అంగీకరించగా.. పోలీసుల విచారణలో మాత్రం 13 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి రూ. 15 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తనఖాలో ఉన్న మరో 20 తులాల ఆభరణాలు రికవరీ చేసుకోవాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఎస్సై ఐ. సన్యాసిరావు, హెచ్‌సీలు జి.నాగేంద్రప్రసాద్, జి.మహేశ్వరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, ఎం.వాసులను ఎస్పీ రాజకుమారితో పాటు సీసీఎస్ డీఎస్పీ జె. పాపారావు, విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్బీ డీఎస్పీ సీఎం సన్యాసినాయుడు, సీసీఎస్ సీఐలు డి. లకు‡్ష్మనాయుడు, దాసరి లక్ష్మణరావు, కాంతారావు, ధనుంజయరావు, తదితరులు అభినందించారు. నిందితుడు గతంలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి నిందితుడు లకు‡్ష్మనాయుడు ఇండియన్ ఆర్మీలో 1996 నుంచి 2005 వరకు పనిచేశాడు. అప్పట్లోనే పలు నేరాలకు పాల్పడడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ. 70 లక్షల వరకు కాజేశాడు. ఈ సంఘటనపై విశాఖ జిల్లా చీడికాడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. శ్రీకాకుళంలో ఒక హత్యకేసు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్ కేసు, మరో రేప్ అండ్ మర్డర్ కేసు, గుంటూరు జిల్లాలో మరో రెండు కేసుల్లో లకు‡్ష్మనాయుడు నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి భార్య కూడా ఒక దొంగతనం కేసులో మంగళగిరి జైల్లో ఉందని పోలీసులు తెలిపారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.రాజకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మవద్దని.. వారిచ్చే వస్తువులు, పానీయాలు, భోజనాలు, టీ, కాఫీ, టిఫిన్స్ వంట వి తీసుకోరాదన్నారు. అనుమానితుల సమాచారన్ని డయల్ 100కి గానీ, వాట్సాప్ నంబర్ 63098 98989 అందించాలని సూచించారు. -
పుత్తడిని చూపి..ఇత్తడి అంటగట్టి!
సాక్షి, సిటీబ్యూరో: తవ్వకాల్లో దొరికిన పురాతన బంగారం అంటూ నమ్మిస్తారు... టెస్టింగ్ కోసం పుత్తడితో చేసిన నాణాలు, విగ్రహం ముక్కలు ఇస్తారు... టార్గెట్ చేసిన వ్యక్తి నుంచి నగదు అందిన తర్వాత ఇత్తడి అంటగట్టి ఉడాయిస్తారు. ఈ పంథాలో మోసాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ముఠాకు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.9 లక్షల నగదు, పురాతనమైనదిగా కనిపిస్తున్న మహావీరుడి విగ్రహం, ఇత్తడి నాణాలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని అక్రమాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ కల్లు 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఛత్రినాకలో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్ళి్లతను ఇటీవల తన స్వస్థలానికి వెళ్లినప్పుడు తన స్నేహితుడైన అర్జున్ శర్మను కలిశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి ఇత్తడిని పుత్తడిగా నమ్మించి మోసాలు చేద్దామని ఇద్దరూ పథకం పథకం పన్నారు. పాత నేరగాడైన అర్జున్‌పై గతంలో కేరళలోని తివేండ్రం, తమిళనాడులోని కొయంబత్తూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో 10 గ్రాముల బంగారు నాణాలు, మూడు బంగారు కోటింగ్ నాణాలతో పాటు 380 ఇత్తడి నాణాలు, ఇత్తడిదిగా అనుమానిస్తున్న వర్థమాన మహావీరుడి విగ్రహం (5 కేజీల బరువు) తీసుకుని నగరానికి వచ్చి ఛత్రినాకలోని కల్లు వద్ద మకాం వేశాడు. వీరిద్దరూ కలిసి తమ వద్ద పురాతన బంగారు నాణేలు, విగ్రహం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఆసక్తి చూపిన వారికి తాను ఉత్తరప్రదేశ్‌లోని తమ పొలం దున్నుతుంటే అవి దొరికాయని, ఎక్కువ కాలం దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో విక్రయిస్తున్నట్లు చెప్పేవారు. తమ వద్ద ఉన్న నాణాల మధ్యలో 10 గ్రాములు బంగారంతో చేసినవి, మూడు బంగారం కోటింగ్‌తో ఉన్నవి ఉంచేవారు. వర్థమాన మహావీరుడి కుడి భుజం భాగంలో ‘వీ’ ఆకారంలో కోసి అందులో బంగారంతో చేసిన ముక్కను అతికించేవారు. ఆసక్తి చూపిన వారికి టెస్టింగ్ కోసం అంటూ ఈ ముక్కతో పాటు బంగారు నాణెం ఇచ్చేవారు. పరీక్షలో నిజమైన బంగారంగా తేలడంతో ఎదుటి వారు వారి వల్లో పడిపోతున్నారు. ఆపై మొత్తం బంగారం తీసుకునేందుకు డబ్బు తీసుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి రావాల్సిందిగా సూచించేవారు. వారు డబ్బు పట్టుకుని వచ్చిన తర్వాత పోలీసులు వస్తున్నారంటూ హడావుడి చేస్తారు. అదను చూసుకుని ఇత్తడి సరుకు అంటగట్టి డబ్బు తీసుకుని ఉడాయించేవారు. ఈ పంథాలో వీరు పలువురిని మోసం చేశారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన శ్రీరామదాస్ సంజీవచారికి ఇదే తరహాలో ఎర వేసిన ఈ ద్వయం అతడి నుంచి రూ.13.45 లక్షలు స్వాహా చేసింది. బాధితుడి ఫిర్యాదుతో అంబర్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. ఇలా వచ్చిన డబ్బును ఇద్దరు నేరగాళ్లు సమానంగా పంచుకుంటున్నారు. వీరి వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో రంగంలోకి దిగారు. ముమ్మరంగా గాలించి సోమవారం నిందితులను పట్టుకున్నారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. -
దీప్తి.. కార్పొరేషన్‌నూ వదల్లేదు
సాక్షి, గుంటూరు : నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్ళపల్లి దీప్తి చేతివాటం ప్రదర్శించడంలో తనదైన ముద్ర వేసుకుంది. సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకొని బాధితుల ఫిర్యాదుతో పరారైన విషయం తెలిసిందే. ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ హయాంలో మంత్రి సాయంతో కాంట్రాక్ట్‌ను కొట్టేసింది. ఆనందలహరి నిర్వహణ కోసం.. 2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్ అధికారులకు తరచూ ఫోన్ చేయించి వారిని దారికి తెచ్చుకుంది. ఈ క్రమంలో గుంటూరులో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో దీప్తి తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో మరో సంస్థ నిర్వాహకులు కూడా దరఖాస్తు చేశారు. వెంటనే కాంట్రాక్ట్ తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు మంజూరు చేసే అధికారిని సైతం మభ్యపెట్టి సదరు మాజీ మంత్రితో కార్పొరేషన్ రికమండ్ చేయించి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్ రూ.60 వేల చొప్పున చెల్లుస్తుంది. నిబంధనల ప్రకారం కార్యక్రమం కొనసాగించకుండా రూ.20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. దీంతో నగరంలో కార్యక్రమం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఏడాదిపాటు కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకేష్ లఠ్కర్ ఇదంతా దోపిడీ అని తేల్చి బిల్లులు నిలుపుదల చేశారు. మళ్లీ బిల్లుల చెల్లింపుల కోసం... అప్పట్లో పర్యవేక్షణాధికారిగా పని చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారి మళ్లీ బదిలీపై ఇక్కడకే వచ్చారు. దీంతో దీప్తి, ఆమె స్నేహితులు సదరు అధికారి వద్దకు వెళ్లి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అందుకు కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బిల్లు పెండింగ్‌లో ఉంది. మంగళగిరి మాయ‘లేడీ’ ఉలికిపాటు మంగళగిరిలో మరో కలాడీ లేడీ బాగోతం అంటూ సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం టీడీపీ నాయకులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. విజలెన్స్ అధికారులు సైతం బాధితుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. తెనాలిలోని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేసిన కిలాడీ లేడీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. మాజీ హోంమంత్రి చినరాజప్పతో తనకు పరిచయాలు ఉన్నాయని పలువురిని నమ్మించింది. సేల్స్ మేనేజర్‌గా పని చేసిన సమయంలో తనతో పని చేసిన సహ ఉద్వోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్వోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. తాజాగా సాక్షి దినపత్రికలో కథనం రావడంతో కిలాడీ లేడీ ఉదయం నుంచి బాధితులకు ఫోన్ చేసి తాను విదేశాలలో ఉన్నానని, వారంలో వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతోంది. దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దంటూ బతిమాలుతున్నట్లు సమాచారం. కొందరు బాధితులు వెంటనే తాము ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. చదవండి: నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ.. -
ఉద్యోగం పేరుతో ఘరానా మోసం
సాక్షి, తిరుపతి : ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసగించాడని బాధితులు అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. అర్బన్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉదయం 9నుంచి సాయంత్రం వరకు అదనపు ఎస్పీ నుంచి ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేసి, రశీదు అందించారు. ఇందులో ఎస్పీ కార్యాలయానికి 60 ఫిర్యాదులు, జిల్లా వ్యాప్తంగా 21 ఫిర్యాదులు అందాయని ఎస్పీ వెల్లడించారు. తిరుపతి సంజయ్‌గాంధీకాలనీలో నివాసముంటున్న రూప్‌కుమార్ బీవీఎం డిగ్రీ చదివాడు. ఆన్లైన్లో విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రూవిన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రన్, ఆ సంస్థ సభ్యులు కాల్చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. రూ.లక్ష డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో వారిని నమ్మి మెడికల్, ఇతర ఖర్చుల కోసం రూ.5.50లక్షలు అకౌంట్లో డిపాజిట్ చేశానని రూప్‌కుమార్ తెలిపాడు. అయితే వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. దీనిపై స్పందించిన ఎస్పీ, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కేసును అలిపిరి పోలీసుస్టేషన్‌కు సిఫార్సు చేశారు. పోలీసుస్టేషన్ల నుంచి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. దీంతోపాటు ప్రతి ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కి పంపి చర్యలు తీసుకునేలా ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. కేసులపై తీసుకున్న చర్యలు తిరిగి ఎస్పీ కార్యాలయానికి అందేలా ఆదేశాలు జారీ చేశారు. -
అధిక వడ్డీల పేరుతో టోకరా
సాక్షి, పశ్చిమ గోదావరి : అధిక వడ్డీలను ఆశచూపి కోట్లు కొల్లగొట్టిన కంచర్ల రమేష్‌నాయుడు, దివ్య దంపతుల ఆచూకీ కోసం కోసం బాధితులు లబో దిబోమంటూ తిరుగుతున్నారు. నరసాపురం వై ఎన్ కళాశాల రోడ్డులో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రమేష్‌నాయుడు దంపతులు పక్కా ప్లాన్‌తో అందిన కాడికి అప్పులు చేసి, చిట్టీలు కట్టించుకుని కనిపించకుండా పోయారు. బాధితుల ఆవేదనను వివరిస్తూ మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన వార్తతో మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. రమేష్‌నాయుడు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. రమేష్‌నాయుడు దంపతులు దాదాపు రూ.7 కోట్ల వరకూ కుచ్చుటోపీ పెట్టినట్టుగా తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం వీరు అయినకాడికి దండుకున్నారు. బాధితుల్లో ఇంటికొచ్చి పచ్చిరొయ్యలు అమ్ముకునే వృద్ధురాలి నుంచి న్యాయవాదుల కుటుంబాల మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. పక్కా ప్లాన్‌తో.. రమేష్‌నాయుడు దంపతులు అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ లగ్జరీగా జీవించేవారు. రమేష్‌నాయుడు గతంలో ఓ ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీలో పనిచేసేవాడు. ఈనేపథ్యంలో ఇంటి వద్ద చిట్టీలు కట్టించుకోవడం ప్రారంభించారు. అలాగే తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెబుతూ అధిక వడ్డీలకు అప్పులు చేసేవారు. అప్పులు ఇచ్చిన వారికి కొంతకాలం నూటికి రూ.5, రూ.10 చొప్పున వడ్డీ సొమ్ములు ముట్టజెప్పారు. ఇది బాగా ప్రచారం కావడంతో చాలామంది వీరికి అప్పులు ఇచ్చారు. వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పచ్చిరొయ్యలు అమ్మేవారు, పాలు పోసేవారు కూడా వీరి వద్ద చిట్టీలు కట్టారు. చివరకు అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను కూడా ఈ జంట వదల్లేదు. పాట పాడుకున్న తరువాత వారికి డబ్బులు ఇవ్వకుండా, అధిక వడ్డీలు ఇస్తామని సొమ్ములు వారివద్దే ఉంచుకునేవారు. రమేష్‌నాయుడు అతని భార్య దివ్య తమ పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజులు అంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్దస్థాయిలో ప్రచారం చేసుకుని పరిచయాలు పెంచుకున్నారు. ఇలా సేకరించిన మొత్తం సొమ్ములతో వీరు ఉడాయించారు. పెద్ద సంఖ్యలో బాధితులు బాధితుల్లో పెద్దల కుటుంబాల వారే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. న్యాయవాదుల నుంచి పెద్ద వ్యాపారుల కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు రూ.50 లక్షలు, రూ.30 లక్షలు చొప్పున అప్పులిచ్చినట్టు సమాచారం. అయితే వీరు కేసులు జోలికి వెళ్లకుండా పరిచయస్తుల ద్వారా రమేష్‌నాయుడు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ లో వచ్చిన వార్తతో మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. ‘సాక్షి’ వార్తకు స్పందించిన టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి కూడా మంగళవారం అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి కొందరితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని నచ్చజెప్పారు. అయితే పోలీసులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు ఇప్పటివరకూ అందలేదు. మొత్తంగా ఈ ఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. -
ఉద్యోగాల పేరుతో మోసం..
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్‌కడప): ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పెద్ద పెద్ద చదువులు చదివారు.. ఒక్కో ఇంట్లో ఇంజినీరింగ్ చదివిన వారు ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు.. 10, ఇంటర్ అర్హత కలిగిన ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు.. ఉన్నత చదువులు చదివి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. చిన్న ప్రైవేట్ ఉద్యోగమైనా దొరికితే చాలనుకునే ఇలాంటి నిరుద్యోగుల ఆశలను, అవకాశాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని ఉడాయిస్తున్నారు. నిరుద్యోగులు మోసపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించిన యువకులు వారు మోసపోయామని గ్రహించడానికి నెలలు, ఏళ్లు పడుతోంది. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మోసగాళ్లపై కేసులు నమోదవుతున్నా ఫలితం లేదనే చెప్పాలి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో పలువురు నిరుద్యోగులు మోసపోయిన సంఘటనలు ∙కొండాపురం మండలంలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్కో వ్యక్తి వద్ద రూ.6 లక్షలు వసూలు చేసి వాళ్లిద్దరూ ఉడాయించారు. కొండాపురం, సింహాద్రిపురం మండలంలోని పలువురు యువకులు అతనికి డబ్బు ఇచ్చి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై కేసులు నమోదైనా బాధితులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే చెప్పాలి. ∙కొన్ని రోజుల క్రితం నందలూరులోని ఆల్విన్ ఫ్యాక్టరీ స్థలంలో సోలార్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని కడపకు చెందిన వ్యక్తి బాగా ప్రచారం చేశాడు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు తన వద్ద ఉన్నాయని చెప్పి దరఖాస్తు ఫారం రూ.100గా నిర్ణయించాడు. ఈ ఫ్యాక్టరీలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడంతో కడపతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన యువకులు నిరుద్యోగులు అతని వద్ద దరఖాస్తు ఫారాలు తీసుకొని వెళ్లారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని, మోసపోయామని గ్రహించిన కొందరు నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ∙కొన్ని నెలల క్రితం ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానికుల సాయంతో ప్రొద్దుటూరులో ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్, మస్కట్, ఖతార్ తదితర ప్రాంతాల్లోని కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బాగా ప్రచారం చేశారు. ఒక్కో వ్యక్తి వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు వసూలు చేసుకున్నారు. వారి పాస్‌పోర్టులను కూడా తీసుకొని రాత్రికి రాత్రే ఉడాయించారు. సుమారు 40 మందికి పైగా మోసపోయారు. బాధితులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ∙తాజాగా ప్రొద్దుటూరులో సుమారు 150 మంది యువకులు ఉద్యోగాల కోసం డబ్బు ఇచ్చి మోసపోయారు. వీరు ఏడాది క్రితం ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులకు రూ. 50 వేలు చొప్పున చెల్లించారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీలో ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని, జీతం కూడా సుమారు రూ.1.20 లక్షలు దాకా ఉంటుందని చెప్పడంతో డబ్బు కట్టారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి, ఖాజీపేట, గోపవరంతో పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు డబ్బు చెల్లించారు. వీరిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపిస్తారని ఐదు నెలల నుంచి అడుగుతున్నా వారు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల ముగ్గురి ఫోన్లు కూడా పని చేయకపోవడంతో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన పాతకడప రెడ్డయ్య ఫిర్యాదు మేరకు శ్రీనివాసనగర్‌కు చెందిన హెచ్ఎం బాషా, నాగరాజు, నాగేంద్రకుమార్‌లపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. -
జాబు కావాలా బాబూ..?
సిద్దిపేట టౌన్: ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో పైరవీకారులు కొత్త దందాకు తెరతీశారు. తమకున్న పరిచయాలతో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగంపై ఆశతో కొందరు ఈ మోసగాళ్ల వలలో పడుతున్నారు. జాబ్ కావాలంటే ఖర్చు అవుతుంది లేకపోతే ఊరికే రాదు కదా అంటూ నిరుద్యోగుల దగ్గర నమ్మబలుకుతున్నారు. వారి మాటలు నమ్మి జాబ్ వస్తుందనే సంతోషంలో తర్వాత పరిణామాలు ఏమిటనేది ఆలోచించకుండానే అడిగినన్ని డబ్బులు వారి చేతిలో పెడుతున్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో పరిచయాలు పెంచుకొని రోజు కలెక్టరేట్‌కు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడికి వచ్చిన వారితో మాటామాటా కలిపి వారిని జాబ్ ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలోని సుమారు 40 మంది వరకు ఉద్యోగాలకోసం పైరవీకారులకు డబ్బులు ఇచ్చి వారి వెంట తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జాబ్‌లు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి పేరును వాడుకుంటూ అతనికి మాకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మేం ఎవరికి జాబ్ కావాలని చెప్పితే వారికి జాబ్ ఇస్తారంటూ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. కలెక్టరేట్లోనే తిష్ట... ఒక వ్యక్తికి కలెక్టరేట్లో జాబ్ ఇప్పిస్తామని అందులో పనిచేసే అతను సుమారు రూ.1 లక్ష తీసుకొని 2 నెలల్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. డబ్బులు తీసుకొని 6 నెలలకు పైగా గడిచినా జాబ్ ఇప్పించకపోవడంతో విసిగిపోయిన సదరు వ్యక్తి డబ్బులు తీసుకున్న వ్యక్తికోసం 2 నెలలుగా రోజు కలెక్టరేట్‌కు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి చూస్తూ తిరిగిపోతున్నాడు. కలెక్టరేట్‌లోకి ఒక సాధారణ వ్యక్తిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నా ఎందుకు వస్తున్నాడంటూ అతని గురించి ఎవరూ ఆరా తీయకపోవడం విశేషం. డబ్బులు తీసుకున్న వ్యక్తి బుజ్జగిస్తూ రేపూ మాపు వస్తుంది అంటూ తిప్పుతుండడంతో గట్టిగా నిలదీయడంతో అతని డబ్బులు అతనికి తిరిగి ఇస్తానంటూ చెప్పినట్టు తెలిసింది. దీనిపై కలెక్టరెట్ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. అధికారుల అండా.. లేక ప్రజాప్రతినిధులదా! జాబ్‌లు ఇప్పిస్తామంటూ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న కొందరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారులతో సాన్నిహిత్యం పెంచుకొని అమాయకులను నమ్మించి వారి జేబులు కొల్లగొడుతున్నారు. ప్రజాప్రతినిధులే అనుకుంటే ప్రభుత్వ అధికారులు సైతం ఉద్యోగాల పేరిట పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో ఓ 10, 15 మంది పైరవీకారులుగా అవతారం ఎత్తి అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నా ఎవరూ దీని గురించి నోరు మెదపడం లేదు. డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు సైతం వీరి గురించి వివరాలు చెప్తున్నారు తప్పితే బయటకు వచ్చి నిలదీసేవారు ఎవరూ లేకపోవడం కొసమెరుపు. ఇలాంటి వాటికి ఇకనైనా ఫుల్స్టాప్ పడుతుందా లేదా చూడాలి. -
చాటింగ్.. నయా చీటింగ్!
సాక్షి, సిటీబ్యూరో: యువతులు, మహిళలతో చాటింగ్ ముసుగులో కొత్త తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నాళ్ళు స్నేహం నటించిన సైబర్ నేరగాళ్ళు ఆపై మార్ఫింగ్ చేసిన ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరి బారినపడిన బాధితురాళ్లలో కొందరు భయపడి తమ నగ్న చిత్రాలను వారికి పంపిస్తున్నారు. ఆపై ఆ నేరగాళ్ల వేధింపులకు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. గత పది రోజుల్లోనే దాదాపు ఏడుగురు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బుధవారం ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల్లో కొందరు బ్లాక్ మెయిలింగ్‌ను ముందే గుర్తించి పోలీసులను ఆశ్రయించగా... మరికొందరు మాత్రం నేరగాళ్ళు చెప్పినట్లు చేసిన తర్వాత ఫిర్యాదు చేశారు. సిటీకి చెందిన ఓ వివాహితకు ‘అస్క్’ అనే చాటింగ్ సైట్లో ఓ గుర్తుతెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతగాడు కొన్నాళ్ళ పాటు ఆమెతో స్నేహపూర్వకంగానే చాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు చెందిన ఫేస్బుక్ ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. అందులో ఉన్న ఆమె ఫొటోలు, వివరాలు సంగ్రహించాడు. ఫేస్బుక్లో ఉన్న ఫొటోల నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోతో జత చేశాడు. ఆపై చాటింగ్‌లో ‘నీకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు నా వద్ద ఇంకా ఉన్నా యి. నాతో అశ్లీలంగా చాటింగ్ చేయకపోతే వాటిని బహిర్గ తం చేస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. తొలుత బాధితురాలు పట్టించుకోకపోవడంతో అతను మార్ఫింగ్ ఫొటోలను ఆమెకు పంపడంతో కంగుతిన్నారు. తన మాట వినకపోతే వీటిని నీ భర్తకు పంపడంతో పాటు సోషల్‌మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. బాధితురాలు పూర్తిగా భయపడిందని నిర్థారించుకున్న తర్వాత ‘నగ్న సెల్ఫీ’లు కావాలంటూ బెదిరించాడు. తనకు ఫోటోలు చాట్ రూమ్ ద్వారా పంపించడం రాదంటూ ఆమె ప్రాధేయపడినా అతగాడు వినిపించుకోలేదు. ఫేస్బుక్ ద్వారా పంపమంటూ తీవ్ర ఒత్తిడి చేస్తూ... ఓ ఐడీ క్రియేట్ చేసి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ సైతం పంపాడు. ఫేస్బుక్ ద్వారానే తనతో అశ్లీల చాట్ చేయాలని బెదిరించాడు. గత్యంతరం లేక బాధితురాలు సెల్ఫీలను పంపినీ సైబర్ నేరగాడి నుంచి వేధింపులు ఆగకపోవడంతో బుధవారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాడు ముందు పంపిన ఫొటోను పరిశీలిస్తే అది మార్ఫింగ్ అని తెలిసిందని, ఈ విషయాలు తన భర్తకు తెలిస్తే ఇబ్బందుల పాలు అవుతానౌ ంటూ కన్నీరుమున్నీరైంది. ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్స్ చేయవద్దని, ఎవరైనా బెదిరింపులకు దిగితే వెంటనే తమకు ఆశ్రయించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. -
తండ్రీకొడుకులపై కేసు
కురవి : మండలంలోని అయ్యగారిపల్లికి చెందిన దూదిమెట్ల లింగన్న, వెంకన్నపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అయ్యగారిపల్లికి చెందిన తండ్రీకొడుకులు దూదిమెట్ల వెంకన్న, లింగన్న మహబూబాబాద్‌కు చెందిన బోడికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మారు. అయితే, సర్వేనంబర్ తప్పుగా చూపించి భూమి అమ్మినట్లు ఫిర్యాదు అందడంతో బుధవారం వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
8న చంద్రబాబుపై చీటింగ్ కేసులు
చీపురుపల్లి: రాష్ట్రం, జిల్లా, మండలాలు, గ్రామాల్లో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసగంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీటింగ్ కేసులు పెట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబుపై ఈ నెల 8న అన్ని పోలీస్స్టేషన్లలో చీటింగ్ కేసులు పెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదన్నారు. ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసగించినందుకు చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరనున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన పాలనందిస్తున్నామని చెప్పుకొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రూ.కోట్లు వెదజల్లి తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా దొరికిపోవడాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు ఆడియో టేపులపై ఫోరెన్సిక్ నివేదికలున్నా, 22 సార్లు చార్జిషీట్లలో నిందితుడిగా పేర్కొన్నా చర్యలు లేవన్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రిపై పెట్టనున్న చీటింగ్ కేసులు కార్యక్రమానికి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల నాయకుడు ఇప్పిలి అనంతం, బెల్లాన త్రినాథ్, కరిమజ్జి శ్రీనివాసరావు, మీసాల రమణ, కంది పాపినాయుడు, పనస అప్పారావు, రఘుమండ త్రినాథ్, రేవల్ల సత్తిబాబు, కోరాడ నారాయణరావు, పతివాడ రాజారావు, మహంతి ఉమ పాల్గొన్నారు.