వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు, సీఐ రాంబాబు తదితరులు
మాదాపూర్: నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ ప్రూప్‌లను ఉపయోగించి వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు రూ.7,50,000 స్వాహా చేసిన వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. నకిలీ పత్రాలను ఉపయోగించి తమ పేర్లతో క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు డ్రా చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్‌లోని గోయల్ పెట్రోల్ బంకులో డబ్బులు డ్రా చేసేందుకు యత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..చిక్కడపల్లికి చెందిన బొల్లు రామారావు 2014లో ఆస్‌టూట్ కార్పోరేట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పని చేసేవాడు.
బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఐడీ ప్రూప్ జిరాక్స్‌లను పరిశీలించడం అతని విధి. తద్వారా బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాల పై అవగాహన పెంచుకున్న అతను ధృవపత్రాల్లో మంచి ప్రొఫైల్ ఉన్నవాటిని ఎంచు కుని పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల్లో ఫొటోల మార్చి బ్యాంకులకు ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేవాడు. ఇలా సంజయ్‌కుమార్ గూటి, చేటూరి శివకృష్ణలతో పాటు పి.యాదగిరి,సాయి ఉమేష్, సతీష్, సాయిచంద్ పేర్ల మీద ఎస్‌బీఐ, రత్నాకర్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ బ్యాంకు, అనెక్స్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులలో నకిలీ క్రెడిట్ కార్డులు తీసు కుని సుమారు రూ.7,50,000 వరకు నగదును డ్రా చేసినట్లు తెలిపారు. కనకదుర్గా ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ప్రైవేటు లిమి టెడ్ కూకట్‌పల్లి బ్రాంచ్‌లో రూ. లక్ష రూపాయాల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి దొంగ ఐడీ కార్డులు, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాయదుర్గం సీఐ రాంబాబు, ఎస్‌ఐ మురళీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment