id proofs
-
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : రైలుల్లో ప్రయాణించే వారికి ఐడెంటీ ప్రూఫ్స్ తప్పనిసరి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే ఎలా అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఏం ఆందోళన చెందక్కర్లేదట. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ వెర్షన్లను ఐడీ ప్రూఫ్స్ అంగీకరిస్తామని దేశీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్ అందించే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీలను అంగీకరిస్తుందని గురువారం ప్రకటించింది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ స్టోరేజ్ సర్వీసులను అందిస్తోంది. ఈ విషయంపై అన్ని జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను, వాలిడ్‌గా భావిస్తామని రైల్వే చెప్పింది. ‘డిజిలాకర్ అకౌంట్లోకి లాగిన్ అయి ఇష్యూడ్ డాక్యుమెంట్ల సెక్షన్‌కు వెళ్లి ప్రయాణికులు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే, దాన్ని వాలిడ్ గుర్తింపుగానే ధృవీకరించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వపు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను, ఆధార్‌ను డిజిటల్‌గా అందిస్తోంది. సీబీఎస్ఈతో కూడా ఇది భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. -
అడ్డంగా వాడేస్తాడు..
మాదాపూర్: నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ ప్రూప్‌లను ఉపయోగించి వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు రూ.7,50,000 స్వాహా చేసిన వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. నకిలీ పత్రాలను ఉపయోగించి తమ పేర్లతో క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు డ్రా చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్‌లోని గోయల్ పెట్రోల్ బంకులో డబ్బులు డ్రా చేసేందుకు యత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..చిక్కడపల్లికి చెందిన బొల్లు రామారావు 2014లో ఆస్టూట్ కార్పోరేట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పని చేసేవాడు. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఐడీ ప్రూప్ జిరాక్స్‌లను పరిశీలించడం అతని విధి. తద్వారా బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాల పై అవగాహన పెంచుకున్న అతను ధృవపత్రాల్లో మంచి ప్రొఫైల్ ఉన్నవాటిని ఎంచు కుని పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల్లో ఫొటోల మార్చి బ్యాంకులకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేవాడు. ఇలా సంజయ్‌కుమార్ గూటి, చేటూరి శివకృష్ణలతో పాటు పి.యాదగిరి,సాయి ఉమేష్, సతీష్, సాయిచంద్ పేర్ల మీద ఎస్బీఐ, రత్నాకర్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ బ్యాంకు, అనెక్స్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులలో నకిలీ క్రెడిట్ కార్డులు తీసు కుని సుమారు రూ.7,50,000 వరకు నగదును డ్రా చేసినట్లు తెలిపారు. కనకదుర్గా ఇన్ఫ్రాస్ట్రక్షర్ ప్రైవేటు లిమి టెడ్ కూకట్పల్లి బ్రాంచ్‌లో రూ. లక్ష రూపాయాల ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి దొంగ ఐడీ కార్డులు, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాయదుర్గం సీఐ రాంబాబు, ఎస్ఐ మురళీ పాల్గొన్నారు. -
'అనంత'లో ఉగ్రవాదుల కీలక పత్రాలు లభ్యం
అనంతపురం: గత వారం హైదరాబాద్ లో కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు, భద్రతా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తాజాగా అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. బస్టాండ్ సమీపంలోని నంది రెసిడెన్సిలో సోదాలు నిర్వహించి లాడ్జి నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో అరెస్టయిన ఐసిస్ సానుభూతిపరులను అనంతపురం పట్టణానికి తీసుకొచ్చి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తుపాకీ కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు ఇక్కడికి వచ్చారని వివరించారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులను జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.