దిండి: తప్పుడు ధ్రువపత్రాలతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని విడాకులు పొంది తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. నల్గొండ జిల్లా దిండి మండల పరిధిలోని గొల్లనపల్లి గ్రామానికి చెందిన ఆర్కపల్లి నాగార్జున హైదరాబాద్ గోషామహల్ పోలీసు స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ నాంపల్లి పుష్పలతను 2015లో వివాహం చేసుకున్నాడు. కాగా, కోర్టులో ఆమె ఊరి పేరు మార్చి 2016లో పెళ్లి చేసుకున్నట్లు కోర్టులో తప్పుడు పత్రాలతో విడాకుల కోసం దాఖలు చేసుకున్నాడు. గత డిసెంబర్ 19న విడాకులు కూడా పొందాడు.
తనను వివాహం చేసుకున్న సంవత్సరం, తన ఊరి పేరుపై తప్పుడు పత్రాలు సమర్పించి విడాకులు తీసుకుని పుష్పలత ఆరోపించింది. భర్త నాగార్జున తనను మోసగించాడంటూ పుష్పలత స్థానిక పోలీసు స్టేషన్ సెంటర్‌లో ధర్నాకు దిగింది. పెద్ద మనుషులు న్యాయం చేస్తామని చెప్పి ముఖం చాటేశారని ఆమె ఆరోపిస్తోంది. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది.
తప్పుడు ధ్రువపత్రాలతో భార్యకు విడాకులు
Published Sun, Feb 5 2017 7:26 PM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM
Advertisement
Advertisement