► ఇంటర్, డిగ్రీలలో 4,375 మంది...
► సగం మంది నకిలి సర్టిఫికెట్లపైన్నే...
► పాత కరీంనగర్‌లోనే 22 మంది నకిలీలు
► ఈ భాగోతానికి ఆద్యుడు చంద్రబాబు
► లోకాయుక్తలో నిరుద్యోగుల ఫిర్యాదు
► వచ్చే నెల 20న హైదరాబాద్‌లో విచారణ
సాక్షి, కరీంనగర్ :
ఇంటర్మీడియట్ విద్యావిధానంలో నకిలీ సర్టిఫికెట్లు కలిగిన కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల (పర్మినెంట్)ను రెగ్యులరైజ్ చేసే వ్యవహారం లోకాయిక్తకు చేరింది. ఈ విధానం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టుతుందని ఫిర్యాదు చేశారు. బీహార్, కువ్వంపు, వినాయక మిషన్, ద్రావిడ తదితర యూనివర్శిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు పొందిన పలువురి నియామకం వివాదస్పదం అవుతోంది. నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విధానం అతిదారుణమని నిరుద్యోగులు, అర్హులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఈ విధానంలో అనేకమైన లొసుగులున్నాయని వారంటున్నారు. రిజర్వేషన్లను ఉల్లంఘించడం, అనర్హులను అందలమెక్కించడం రాజ్యాంగ విరుద్దమైన విధానంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అనర్హులతో గెజిటెడ్ పోస్టులలో నింపివేశారంటూ పలువురు లోకాయుక్తను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్‌లో 3685 లెక్చరర్ల పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 1050 వరకు పోస్టులు పూర్తి స్థాయిలో అనర్హులతో నింపివేయగా, ఒక్క పూర్వ కరీంనగర్ జిల్లాలోనే 22 మంది నకిలీలని తేలడం వివాదస్పదం అవుతోంది.
నిబంధనలు ఏమి చెప్తున్నాయి..
ఇంటర్మీడియట్‌లో ఇతర రాష్ట్రాల నుంచి, కొని తెచ్చుకున్న యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీల డిగ్రీలు వీరికి ఎలాంటి విద్యా ప్రావీణ్యత లేదు. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉంటేనే అదే సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇలాంటి నియమాలు లేని డిగ్రీలు ఉన్నవి. ఒక సబ్జెక్టు లెక్చరర్‌గా నకిలీ (ఫేక్) సర్టిఫికేట్స్‌తో జాయిన్ అయిన అతడే మరో సర్టిఫికెట్ సృష్టించుకోని పోస్టు డిమాండ్ ప్రకారం అందులోకి మారినవారున్నారు. దాదాపు అంటే ఇందులో 80 శాతం మంది ఇలాంటి డిగ్రీలు కలిగిన వారున్నారు. ఇక వీరి నియామకం చాలా హాస్యాస్పదం. ఈ ఫేక్ సర్టిఫెకెట్‌గాళ్లకు ఎలాంటి రాత పరీక్ష లేదు. 2000 సంవత్సరంలో కాలేజీ వైజ్‌గా పేపర్ ప్రకటన అంటే (ప్రెస్‌నోట్)చిన్నగా ఇచ్చి ఇలాంటి వారిని ప్రిన్సిపల్స్ ద్వారా ఎంపిక చేశారు. రెగ్యులర్ పోస్టులు రాజ్యాంగ బద్ద సంస్థ ఏపీపీఎస్‌సీ ద్వారా నింపాల్సిన పోస్టులను చాలా ‘ఛీప్’గా వారితో నింపారు. వాస్తవంగా గెజిటెడ్ పోస్టులను ఏపీపీఎస్‌సీ ద్వారా నింపాలి. నేడైతే తెలంగాణ టీఎస్‌పీపీఎస్‌సీ ద్వారా జాతీయ పేపర్లో నోటిఫికేషన్స్ ఇచ్చి రాత పరీక్ష– ఇంటర్వ్యూల ద్వారా నింపాలి. కానీ అలా కాకుండా ఇలా ఫేక్ సర్టిఫికేట్ వారితో వారి అనుకూలమైన వారితో నింపారు. దశాబ్దకాలంగా ఏపీపీఎస్‌సీ ని నిర్వీర్యం చేసిన ఆంధ్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల విధానంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే వస్తుంది. అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత లేని వారే కొనసాగుతున్నారు. ఇదిలా వుంటే 2007–08 లో శాసనసభ కమిటి సిఫారసు మేరకు ఆర్‌జేడీ ద్వారా రోస్టర్‌వైజుగా నోటిఫికేషన్ వేసి 14 సబ్జెక్టులలో 355 మందిని మాత్రమే రోస్టర్ ద్వారా ఎంపిక చేశామంటున్నారు. కానీ ఇందులో కూడా అనేక మంది ఫేక్ సర్టిఫికేట్‌లతో చేరినారు.
రోస్టర్ విధానంకు వక్రభాష్యం..
3650 పోస్టులలో కేవలం 355 మందిని 14 సబ్జెక్టులలో అదీ శాసనసభ కమిటీ సిఫారసు మేరకు రోస్టర్ లో ఎంపిక చేశామంటున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గెజిటెడ్ పోస్టులను ఎక్కడి వారే అక్కడ స్థానికులను అందులో ఫేక్ సర్టిఫికేట్ దూర విద్యా విధానం ఇతర రాష్ట్రాల డిగ్రీల వారే ఉన్నారు. ఎందరో నిరుద్యోగులు రెగ్యులర్ యూనివర్సిటీలు, అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలలో చదివిన వారు నిరుద్యోగులుగా ఉన్నారు. వారి నోట్లో మట్టి కోట్టే కనీస విద్యా ప్రావీణ్యత లేనివారు ఎలాంటి పరీక్ష పాస్ కాకుండానే ఇందులో చేరినారు. ఎలా గెజిటెడ్ పోస్టులలో రెగ్యులర్ చేస్తారు? అంటూ నిరుద్యోగులు లోకాయుక్తలో సవాల్ చేశారు. ఇంగ్లీష్ వాటికి అందులో ప్రావీణ్యత ఉండదు గనక కనీస ప్రావీణ్యత లేని వీరికి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పరీక్షల నిర్వహించి వీరి కొనసాగింపు అపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అన్ని పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ ద్వారా చేయాలంటున్నారు. ఈ వ్యవహారంపై వచ్చే నెల 20న విచారణ జరపనుండగా, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్‌ల ఫేక్ సర్టిఫికేట్‌లపై తక్షణం సీబీసీఐడీతో దర్యాప్తు జరుపాలని కోరుతున్నారు.
నకిలీ సర్టిఫికెట్లపై కాంట్రాక్టు లెక్చరర్లు !
Published Sat, May 13 2017 4:29 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement