సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో పనిచేసిన ఉద్యోగులే ఆ సంస్థకు కుచ్చుటోపి పెట్టారు. జీఎస్‌ఎం మానిటరింగ్ సిస్టమ్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు చీఫ్ విజిలెన్స్ అధికారి సి.మురళీధర్‌రావు గుర్తించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అర్హత లేని ఈఎల్‌డీ అనే సంస్థకు టెండర్లు అప్పగించినట్టు ఆరోపించారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు 2013లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం సీవీసీ సూచ న మేరకు సీబీఐ హైదరాబాద్ జోనల్ అధికారులు కేసు నమోదు చేశారు.
2004 నుంచి 2010 మధ్య మానిటరింగ్ పరికరాల కొనుగోలులో రూ.40 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు సీబీఐ గుర్తించింది. దీంతో ఈసీఐఎల్ ఐటీ అండ్ టీజీ విభాగం మాజీ డీజీఎం కె.హరి సత్యనారాయణ, టీసీడీ ఐటీ అండ్ టీజీ మాజీ జీఎం వి.సత్యనారాయణ, పర్చేజ్ విభాగం మాజీ డీజీఎం ఎం.విష్ణుమూర్తి, టెక్ని కల్ విభాగం మాజీ డైరెక్టర్ గడినాగ వెంకట సత్యనారాయణ, మరో రిటైర్డ్ పర్చేజ్ డీజీఎం కాట్రగడ్డ సుబ్బారావుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈఎల్‌డీ సం స్థకు చెందిన కల్నల్ సురేశ్ భాటియా, లియోపాల్‌డిక్, నాథిన్ రోథ్‌విల్, ఈఎల్‌డీ సంస్థ, హార్టన్ కేస్ కమ్యూనికేషన్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment