నకిలీ రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు దాఖలుచేసి అమెరికా ప్రభుత్వ బీమా సంస్థ ‘మెడికేర్’, ఇతర ప్రైవేటు బీమా సంస్థల నుంచి
వాషింగ్టన్: నకిలీ రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు దాఖలుచేసి అమెరికా ప్రభుత్వ బీమా సంస్థ ‘మెడికేర్’, ఇతర ప్రైవేటు బీమా సంస్థల నుంచి అక్రమంగా రూ.కోట్ల నగదు వసూలుచేసిన కేసులో ఓ భారతీయ-అమెరికన్ జంటకు అక్కడి కోర్టు దాదాపు రూ.52 కోట్ల జరిమానా విధించింది. కీర్తీష్ పటేల్, నీతా పటేల్‌లు న్యూజెర్సీలో ‘బయోసౌండ్ మెడికల్ సర్వీసెస్, హార్ట్ సొల్యూషన్స్’ పేరిట మొబైల్ డయాగ్నస్టిక్ కంపెనీని ప్రారంభించారు.
వీరు న్యూయార్క్, న్యూజెర్సీల్లోని డాక్టర్లు సూచించిన ప్రాంతాల్లోని వారికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వైద్య నివేదికలను డాక్టర్లకు పంపాలి. వైద్యులు సంతకం చేసిన రిపోర్టులకు మాత్రమే బయోసౌండ్‌కు మెడికేర్ సంస్థ డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యుల సంతకాలు ఫోర్జరీచేసి వందలాదిగా రిపోర్టులు సృష్టించి వాటిని మెడికేర్‌కు దాఖలుచేసి దాదాపు రూ.30 కోట్లు పొందారు.