Indian-American Couple
-
ప్రవాస జంట పెద్ద మనసు
హూస్టన్: హరికేన్ హార్వీ బాధితుల సహాయార్థం ఓ భారతీయ అమెరికన్ జంట రూ. 1.6 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. హరికేన్ హార్వీ రిలీఫ్ పేరిట ఆదివారం హూస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రేటర్ హూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ తరఫున అమిత్ భండారీ, అర్పితా భండారీలు విరాళాన్ని హూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా టర్నర్ మాట్లాడుతూ హార్వీ తుపాను బాధితులను ఆదుకోవటానికి భారతీయ అమెరికన్లు ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు. హూస్టన్ నగరాభివృద్ధికి భారతీయులు ఎంతో కృషి చేశారని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే తుపానులను మరింత సమర్ధవంతగా ఎదుర్కొనేలా నగరాన్ని తిరిగి పునర్నిర్మిస్తామని వెల్లడించారు. గ్రేటర్ హూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా 700 మందిని రక్షించామని అమిత్ భండారీ తెలిపారు. హార్వీ బాధితులకు సహాయం అందించే వివిధ చారిటీలకు ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.9.7కోట్లు సమకూర్చామన్నారు. బయోఉర్జా గ్రూప్‌కు అమిత్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈనెల ప్రారంభంలో అమెరికాను వణికించిన హార్వీ ధాటికి 70 మంది మరణించగా, 30 వేలమంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే -
ఎన్నారై జంటకు రూ.52 కోట్ల జరిమానా
వాషింగ్టన్: నకిలీ రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు దాఖలుచేసి అమెరికా ప్రభుత్వ బీమా సంస్థ ‘మెడికేర్’, ఇతర ప్రైవేటు బీమా సంస్థల నుంచి అక్రమంగా రూ.కోట్ల నగదు వసూలుచేసిన కేసులో ఓ భారతీయ-అమెరికన్ జంటకు అక్కడి కోర్టు దాదాపు రూ.52 కోట్ల జరిమానా విధించింది. కీర్తీష్ పటేల్, నీతా పటేల్‌లు న్యూజెర్సీలో ‘బయోసౌండ్ మెడికల్ సర్వీసెస్, హార్ట్ సొల్యూషన్స్’ పేరిట మొబైల్ డయాగ్నస్టిక్ కంపెనీని ప్రారంభించారు. వీరు న్యూయార్క్, న్యూజెర్సీల్లోని డాక్టర్లు సూచించిన ప్రాంతాల్లోని వారికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వైద్య నివేదికలను డాక్టర్లకు పంపాలి. వైద్యులు సంతకం చేసిన రిపోర్టులకు మాత్రమే బయోసౌండ్కు మెడికేర్ సంస్థ డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యుల సంతకాలు ఫోర్జరీచేసి వందలాదిగా రిపోర్టులు సృష్టించి వాటిని మెడికేర్‌కు దాఖలుచేసి దాదాపు రూ.30 కోట్లు పొందారు. -
ప్రవాస భారతీయ దంపతుల విరాళం రూ. 650 కోట్లు
న్యూయార్క్: ప్రవాస భారతీయులు రంజన్ టాండన్, చంద్రిక టాండన్ దంపతులు న్యూయార్క్ యూనివర్సిటీకి 650 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ వారంలో ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు చంద్రిక టాండన్ చెప్పారు. ఎన్‌వైయూ పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరుకు టాండన్ దంపతుల పేరు పెట్టనున్నారు. ఎన్‌వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా మార్చనున్నారు. పెప్సీ చీఫ్ ఇంద్ర నూయికి చంద్రిక టాండన్ అక్క అవుతారు. అహ్మదాబాద్ ఐఐఎమ్ నుంచి చంద్రిక ఎంబీఏ, ఐఐటీ నుంచి రంజన్ ఇంజనీరింగ్ చేశారు. టాండన్ దంపతులు 37 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు.