medicare
-
రెయిన్బో చిల్డ్రన్స్ లాభం రూ. 63 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ (ఆర్‌సీఎంఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో ఇది రూ. 61 కోట్లు. ఆదాయం రూ. 313 కోట్ల నుంచి రూ. 333 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోవిడ్ అనంతరం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దానితో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరే కనపర్చిందని ఆర్‌సీఎంఎల్ సీఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో కొత్తగా ప్రారంభించిన శాఖ.. అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగతా అయిదు నెలల్లో మూడు కొత్త ఆస్పత్రులను నెలకొల్పడంతో పాటు ప్రస్తుత ఆస్పత్రిలో అదనంగా మరో బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 472 కోట్ల మేర ఉన్నట్లు, ఆ నిధులను పెట్టుబడి ప్రణాళిక కోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. క్యూ2లో పెట్టుబడి వ్యయాల కింద రూ. 55 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ పడకల సంఖ్య 1,555 నుంచి 1,655కి పెరిగింది. -
ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్ ఇష్యూలకు పోటాపోటీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ సైతం ఉంది. వివరాలు చూద్దాం.. గ్లోబల్ హెల్త్ రెడీ మేడాంటా బ్రాండ్ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ 4.33 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్ సచ్దేవ, సుమన్ సచ్దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వీడా క్లినికల్‌కు సై క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్ రీసెర్చ్ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్వే ఇన్వెస్ట్మెంట్ రూ. 260 కోట్లు, బసిల్ ప్రయివేట్ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. రెయిన్బో చిల్డ్రన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ రెయిన్బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్ కంపెనీ సీడీసీ గ్రూప్ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్ సేవలు అందిస్తోంది. వీనస్ పైప్స్ ట్యూబ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది. క్యాపిల్లరీ టెక్నాలజీస్ క్లౌడ్ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్(శాస్)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ విక్రయానికి ఉంచనుంది. వార్బర్గ్ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్కామ్ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది. -
మెడికవర్ మరిన్ని ఆసుపత్రులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. 20 నెలల్లో 2,000 పడకలను జోడించి మొత్తం సామర్థ్యం 4,500లకు చేర్చింది. ఇప్పుడు అంతే వేగంగా 2024 నాటికి 7,500 బెడ్ల స్థాయికి చేరేందుకు ప్రణాళిక రచించినట్టు మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ అనిల్ కృష్ణా రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో వైద్యులు, నర్సింగ్, ఇతర విభాగాల్లో కలిపి 10,400 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మూడేళ్లలో మరో 5,000 మందికి కొత్తగా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనింకా ఏమన్నారంటే.. మెట్రో నగరాలు లక్ష్యంగా.. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ, మహారాష్ట్రలో ఔరంగాబాద్, నాసిక్, సంగమనేర్లో ఆసుపత్రులు నెలకొన్నాయి. వీటిలో మల్టీ స్పెషాలిటీతోపాటు క్యాన్సర్ కేర్, పిల్లలు, స్త్రీల వైద్యం కోసం ప్రత్యేక కేంద్రాలూ ఉన్నాయి. మూడేళ్లలో కొత్తగా హైదరాబాద్‌తోపాటు వరంగల్, మహారాష్ట్రలో ముంబై, పుణే, కొల్హాపూర్, నాసిక్‌లో హాస్పిటల్స్ జతకూడనున్నాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులో విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తాం. కొన్ని కేంద్రాలు లాభాల్లో, మిగిలినవి లాభనష్టాలు లేని స్థితికి చేరుకున్నాయి. సంస్థలో ప్రధాన వాటాదారు అయిన మెడికవర్ అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాం. ఇతర విభాగాల్లోకి ఎంట్రీ.. ఔషధాల ఉత్పత్తి, విక్రయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నాం. డయాగ్నోస్టిక్స్ సేవలనూ పరిచయం చేస్తాం. ఇప్పటి వరకు సంస్థ రూ.1,450 కోట్లు వెచ్చించింది. మూడేళ్లలో కొత్త కేంద్రాలకు రూ.1,000 కోట్లు వ్యయం కానుంది. క్యాన్సర్ కేర్, పిల్లలు, స్త్రీల కోసం స్పెషాలిటీ హాస్పిటల్స్ నాలుగైదు రానున్నాయి. ఇందుకు మరో రూ.300 కోట్లు వ్యయం ఉంటుంది. 50 శాతం రుణం, మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరులు, వాటా విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరిస్తాం. సంస్థలో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు 60 శాతం వాటా ఉంది. అన్నీ సవ్యంగా సాగితే 2025లో ఐపీవోకు రావాలన్నది ఆలోచన. -
ఆమెకు వాహన యోగం లేదు..
విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్య శాఖలో నెలకొన్న ముసలం ముదురుతుందే తప్ప చల్లారడం లేదు. మిగిలిన ఉన్నతాధికారులందరూ ఒక్క అధికారినే టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన వాహనానికి డీజిల్ గాని లేదంటే అద్దె ప్రాతిపదికన వాహనమైనా సమకూర్చాలని గుమస్తాల దగ్గర నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు అందరినీ వేడుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కర్నూల్లో డీఎంహెచ్ఓ, అడిషనల్ డీఎంహెచ్ఓలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా వివాదం ముదురుతుందో ఏమోనని కొంతమంది ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పరిస్థితి చూస్తే ఆ స్థాయిలోనే ఉందని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖాధికారిని కొంతమంది ఉద్యోగులు తప్పుదోవ పట్టిస్తున్నరనే ఆరోపణులు కూడా వినిపిస్తున్నాయి. డీజిల్ ఇవ్వడం లేదు.. వైద్యారోగ్యశాఖలో అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారిగా సి.పద్మజ పనిచేస్తున్నారు. ఈమె గతంలో డీఎంహెచ్‌ఓగా కూడా ఇక్కడ పనిచేశారు. అయితే ఈమెకు కేటాయించిన వాహనం పాతది కావడంతో తరచూ మోరాయిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆ వాహనంలోనే విధులకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నెల నుంచి అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి వాహనానికి డీజీల్ కేటాయించడం లేదు. దీంతో తన సొంత వాహనంలోనే విధులకు హాజరుతున్నారు. డీజీల్ గాని, అద్దె ప్రాతిపదికన వాహనాన్ని గాని కేటాయించాలని ఆమె పలుమార్లు డీఎంహెచ్ఓకు, జాయింట్ కలెక్టర్‌కు, వైద్యారోగ్య శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌కు రెండు సార్లు లేఖల ద్వారా మొరపెట్టుకున్నారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.దీంతో చేసేది లేక సొంతవాహనంలోనే విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క అదనపు డీఎంహెచ్ఓ పద్మజకు మినహా మిగిలిన అధికారులందరికీ అద్దె ప్రాతిపదికన అధునాతన వాహనాలు సమకూర్చుకోవడం విశేషం. అదనపు వైద్యారోగ్యశాఖాధికారి విధులు.. నెలలో 12 నుంచి 18 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను పరిశీలించాలి. అదేవిధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడం.. మాతా,శిశు మరణాలపై సమీక్షలు.. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల పర్యవేక్షణ వంటి విధులు చేపట్టాల్సి ఉంటుంది. రెండుసార్లు చెప్పాను.. జూలై నెలలో డీజీల్ కాని, అద్దె ప్రాతిపదికన వాహనం కాని ఇవ్వాలని లెటర్ ద్వారా డీఎంహెచ్ఓను అడిగాను. మరలా రెండోసారి కూడా లేఖ రాశాను. ఆరు నెలలుగా సొంత వాహనంలోనే విధులకు హాజరవుతున్నాను. – డాక్టర్ సి.పద్మజ, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి బడ్జెట్ లేదు.. డీజీల్ వేసే పెట్రోల్ బంక్ యాజమానికి రూ.లక్ష వరకు బకాయి ఉంది. అందుకే ఆయన డీజిల్ వేయడం లేదు. ప్రస్తుతం రూ.36 వేల బడ్జెట్ వచ్చింది. అది చెల్లించాం. మిగతా బకాయిలు ఎన్హెచ్ఎం నిధుల నుంచి చెల్లించేందకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ అనుమతి కోరాం. అనుమతి రాగానే బకాయి చెల్లించి, కొత్త డీజీల్ కూపన్ బుక్ తీసుకుని అడిషనల్ డీఎంహెచ్ఓకు ఇస్తాం. పాత వాహనం తిరగడానికి పనికిరాదని ఎస్టీఓ ధృవీకరిస్తే తప్ప అద్దె ప్రాతిపదికన వాహనం సమకూర్చలేం. – డాక్టర్ కె.విజయలక్ష్మి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
‘మెడికేర్’లో తనిఖీ
- అడ్డుకున్న డాక్టర్ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి నంద్యాల: స్థానిక సంజీవనగర్ జంక్షన్ సమీపంలోని మెడికేర్ ఆసుపత్రిలో నిబంధనలకు వ్యతిరేకంగా రక్తాన్ని సేకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గురువారం అధికారులు తనిఖీ చేశారు. ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, కర్నూలు రూరల్, నంద్యాల ఇన్చార్జి డ్రగ్ఇన్స్పెక్టర్ జయలక్ష్మి, కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్‌అలీ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రక్తసేకరణకు వినియోగించే బ్లడ్ బ్యాగ్ లభ్యమైంది. దీన్ని స్వాధీనం చేసుకొని సిబ్బంది నుంచి అధికారుల బృందం సమాచారం సేకరిస్తుండగా డ్రగ్ ఇన్స్పెక్టర్ జయలక్ష్మిని ఆసుపత్రి అధినేత డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకొని బ్లడ్ బ్యాగ్‌ను లాక్కొని మొదటి అంతస్తు నుంచి విసిరేశారు. తర్వాత సిబ్బంది దీన్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. దీంతో అధికారుల బృందం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రక్త సేకరణ అనుమతి లేదు నంద్యాలలో విజయ బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వాసుపత్రి, శాంతిరాం జనరల్ ఆసుపత్రుల్లో మాత్రమే రక్తం తీసుకొనే అవకాశం ఉందని, మిగతా ప్రైవేటు ఆసుపత్రులకు లేదని ఏడీ చంద్రశేఖర్ తెలిపారు. అయితే మెడికేర్‌లో రక్తం సేకరిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలకు వెళ్లామన్నారు. అధికారుల విధుల నిర్వహణకు అక్కడి డాక్టర్, సిబ్బంది ఆటంకం కలిగించారని, వారిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. అధికారులే అసభ్యంగా ప్రవర్తించారు.. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తించారని డాక్టర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ గౌరి బ్లడ్ బ్యాగ్‌ను ఉపయోగించలేదన్నారు. దీన్ని కలిగి ఉండటం తప్పు కాదన్నారు. అయితే తనిఖీలకు వచ్చిన అధికారులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఈ మేరకు ఆమె కూడా ఫిర్యాదును అందజేసిందన్నారు. తాను బ్లడ్ బ్యాగ్‌ను మాయం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు అవాస్తవమన్నారు. -
ఎన్నారై జంటకు రూ.52 కోట్ల జరిమానా
వాషింగ్టన్: నకిలీ రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు దాఖలుచేసి అమెరికా ప్రభుత్వ బీమా సంస్థ ‘మెడికేర్’, ఇతర ప్రైవేటు బీమా సంస్థల నుంచి అక్రమంగా రూ.కోట్ల నగదు వసూలుచేసిన కేసులో ఓ భారతీయ-అమెరికన్ జంటకు అక్కడి కోర్టు దాదాపు రూ.52 కోట్ల జరిమానా విధించింది. కీర్తీష్ పటేల్, నీతా పటేల్‌లు న్యూజెర్సీలో ‘బయోసౌండ్ మెడికల్ సర్వీసెస్, హార్ట్ సొల్యూషన్స్’ పేరిట మొబైల్ డయాగ్నస్టిక్ కంపెనీని ప్రారంభించారు. వీరు న్యూయార్క్, న్యూజెర్సీల్లోని డాక్టర్లు సూచించిన ప్రాంతాల్లోని వారికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వైద్య నివేదికలను డాక్టర్లకు పంపాలి. వైద్యులు సంతకం చేసిన రిపోర్టులకు మాత్రమే బయోసౌండ్కు మెడికేర్ సంస్థ డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యుల సంతకాలు ఫోర్జరీచేసి వందలాదిగా రిపోర్టులు సృష్టించి వాటిని మెడికేర్‌కు దాఖలుచేసి దాదాపు రూ.30 కోట్లు పొందారు.