స్వాధీనం చేసుకున్న నకిలీ సర్టిఫికెట్లు
సుల్తాన్‌బజార్: డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ శశిధర్‌రాజు, అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి, ఏసీపీ చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావులతో కలిసి వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సిరికి శ్రీనివాస్ వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించేవాడడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన బూతం వెంకట రామకృష్ణ ఏజెంట్‌గా పని చేసేవాడు.
వెలుగులోకి వచ్చిందిలా...
రామాంతపూర్ మధురానగర్‌కు చెందిన రామ్మూర్తి ప్రభుత్వోద్యోగం చేస్తూ మృతి చెందడంతో అతడి కుమారుడు సాయినాథ్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. అయితే అతనికి డీగ్రీ లేకపోకపోవడంతో డిగ్రీ సర్టిఫికెట్‌ను జత చేయాలని డీహెచ్ డాక్టర్ లలితాకుమారి నోటీసులు జారీ చేసింది. దీంతో సాయినాథ్ నల్లకుంటకు చెందిన సాదుల రఘురాజ్ సహకారంతో తమిళనాడులోని వినాయక మిషన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుని జత చేశాడు. దీనిపై అనుమానంతో అధికారులు తనిఖీ చేయగా సదరు యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు డీహెచ్ సాయినాథ్‌ను విధులను నుంచి తొలగించి, సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ సర్టిఫికెట్లపై దర్యాప్తు చేపట్టడంతో ఏలూరు నకిలీ సర్టిఫికెట్‌ల రాకెట్ గుట్టు రట్టయ్యింది. దీంతో సిరికి శ్రీనివాస్, వెంకట రామకృష్ణ, రఘురాజ్‌ల స్థావరంపై దాడి చేసి 115 నకిలీ సర్టిఫికెట్లు, సీపీయూ, ప్రింటర్‌లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా సాయినాథ్ ముందస్తు బెయిల్ తీసుకోగా, రఘురాజ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ శశిధర్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment