గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్యారోగ్యశాఖ సంచాలకుల (ఆర్డీ) కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చి పదోన్నతలు తీసుకున్నారనే ఆరోపణలపై బుధవారం విచారణ చేపట్టారు. డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని విచారణ చేశారు. గతంలో ఆర్డీ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్( ఏఎస్‌ఓ) గా పనిచేసిన సాయిబాబు అనే ఉద్యోగి నకలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చి పదోన్నతి పొందాడని ఓ వ్యక్తి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో సదరు ఉద్యోగిపై విచారణ చేసి అతడిని ఎల్‌డి కంప్యూటర్‌గా ఉద్యోగ కేడర్ తగ్గించి ప్రకాశం జిల్లాకు బదలీ చేశారు.
దీంతో సదరు ఉద్యోగి ఆర్డీ కార్యాలయం పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు నకలీ విద్యార్హలతో పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో బుధవారం ఆ ఫిర్యాదుపై విచారణ జరిగింది. గుంటూరులో ఏఎస్‌ఓలు గా పనిచేస్తున్న జి. వెంకటలక్ష్మి, కె.శ్రీనివాసరెడ్డి, డీఎస్‌ఓగా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావు, తెనాలిలో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న ఎంవీ ప్రసాదరావు, హైదరాబాద్‌లో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న డి జయంత్, బాపట్లలో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న షేక్ సయ్యద్ షరీఫ్, ఒంగోలులో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న కె.కామేశ్వరరావు, పి. మణిగంధకుమార్, నెల్లూరులో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసమూర్తి, పిడుగురాళ్లలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. వెంకటేశ్వర్లు, పొదిలిలో రేడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న తిప్పయ్యలపై ఫిర్యాదు అందటంతో విచారణ జరిగింది. వీరంతా 2002 సంవత్సరంలో పదోన్నతులు పొందగా నేడు వారివి తప్పుడు సర్టిఫికెట్లు అంటూ ఫిర్యాదులు వచ్చాయి.
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లపై విచారణ
Published Thu, Jul 21 2016 11:20 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement