idwa
-
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్‌కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్‌ప్లేట్ లేని కారుకు, వైజాగ్‌లోని వేరే కారు నంబర్‌ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు. -
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్‌కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్‌ప్లేట్ లేని కారుకు, వైజాగ్‌లోని వేరే కారు నంబర్‌ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు. -
సంస్కృతిని మంటగలుపుతున్న సీఎం
– ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమాదేవి, ప్రభావతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిపేందుకు బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి ఆరోపించారు. భోపాల్‌లో డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఐద్వా జాతీయ మహాసభలు విజయవంతం కోసం చేపట్టిన చేపట్టిన ఆలిండియా జాతా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కర్నూలుకు చేరుకుంది. జాతాలో వచ్చిన రాష్ట్ర నాయకులకు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సీక్యాంపు సెంటర్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్లను రద్దు చేసి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.నిర్మలమ్మ మాట్లాడుతూ..కర్నూలు జిల్లా కలెక్టర్ నియంతృత్వ పోకడలతో గోరుకల్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలివేలు, పి. నిర్మల, నగర అధ్యక్షురాలు ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఇబ్బందులు పట్టవా..?
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్లను రద్దు చేసి పేదల వర్గాలను ముప్పుతిప్పలు పెడుతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి బి.సావిత్రి విమర్శించారు. మంగళవారం సాయినగర్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రధానశాఖ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ... రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో విరివిగా రూ.100 నోట్లు అందుబాటులోకి తేకుండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. పెద్ద నోట్ల కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు. నల్ల కుబేరులను ర„ìక్షిస్తూ పేద వర్గాల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. -
మహిళలకు రక్షణ కరువు
గన్నవరం : రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించినా, పాలకులు తారతమ్యాలు చూపిస్తూ మహిళలకు విలువ లేకుండా చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. పురుషులతో సమానంగా రాణిస్తునప్పటికీ మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. స్థానిక శ్రీమల్లికార్జున హైస్కూల్లో రెండురోజులు నిర్వహించే ఐద్వా రాష్ట్ర స్తృత స్థాయి సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సంఘ పతాకాన్ని ఐద్వా సీనియర్ నాయకురాలు యర్లగడ్డ జోయా ఆవిష్కరించారు. సంఘ వ్యవస్థాపకురాలు మానికొండ సూర్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రమాదేవి మాట్లాడుతూ మహిళా చట్టాలను పాలకులు నీరుగారుస్తూ, రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్త్రీ, పురుషుల నిష్పత్తిని సమానం చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధాసుందర్రామన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, మాధవి, లక్ష్మి, శ్రీదేవి, జిల్లా కార్యదర్శి పిన్నమనేని విజయ, డివిజన్ కార్యదర్శి మల్లంపల్లి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
'దేశంలోనే పెద్ద మోసగాడు చంద్రబాబు'
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో పెద్ద మోసగాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి విమర్శించారు. మహిళల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఐద్వా విశాఖ నగర కమిటీ ప్లీనరీ సమావేశం సోమవారం వైశాఖి జల ఉద్యానవనంలో జరిగింది. సమావేశంలో ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ర్యాగింగ్ సంఘటనలో ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. నారాయణ కాలేజిలో ఇద్దరు అమ్మాయిలు చనిపోతే, వారి ప్రవర్తన మంచిది కాదని ప్రచారం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సీపట్నంలో దివ్యశ్రీ హత్య కేసులో నిందితులను శిక్షించాలని ఆందోళన చేస్తే హంతకులను కాకుండా నిరసనకారులను నిర్బంధించి కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వం నైజానికి దర్పణమన్నారు. ఎన్టీ రామారావు ఆస్తిహక్కు చట్టాన్ని తీసుకువస్తే..దేశ వ్యాప్తంగా చట్టం చేశారని, ప్రస్తుతం ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. -
మద్యాన్ని ఆపకపోతే మధ్యలోనే దించుతాం
ఐద్వా బస్సుయాత్ర ముగింపు సభలో కేసీఆర్‌కు నేతల హెచ్చరిక హైదరాబాద్: పల్లెల్లో చీప్‌లిక్కర్ సరఫరా చేయాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మధ్యలోనే దించేస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. మద్యాన్ని నియంత్రించాలని, మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో 12 రోజులపాటు జరి గిన బస్సు యాత్ర ముగింపు సభ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరి గింది. సభ ప్రారంభానికి ముందు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిం చారు. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ కార్యదర్శి జగ్మమతి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్ది ఇబ్బందుల పాలు చేస్తున్నాయని విమర్శించారు. మహిళలు మద్యపాన నిషేధం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మద్యాన్ని అరికట్టడానికి బదులు ప్రజలకు మ రింత చేరువ చేయడం వల్ల సమాజంపై విపరీతమైన ప్రభావం చూపుతుందన్నారు. చౌకమద్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాం డ్ చేశారు. మద్యనిషేధ ఉద్యమ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ ఎవరైనా బాగా చదవాలని, బాగా పని చేయాలని ప్రోత్సహిస్తారని, కానీ, కేసీఆర్ అందరు బాగా తాగండంటూ ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ సారా వ్యతిరేక ఉద్యమం తో కాంగ్రెస్, మద్యనిషేధానికి తూట్లు పొడవడంతో టీడీపీలు ఓడిపోయాయని, చౌక మద్యా న్ని ఆపకపోతే ఈ ప్రభుత్వం కూడా మధ్యలోనే కూలిపోతుందన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా మద్యానికి వ్యతిరేకంగా సోదరులతో ప్రతిజ్ఞ చేయించుకొని రాఖీలు కట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజికవేత్త వసంత కన్నాబీరన్, చెరుకూరి గ్రూప్స్ చైర్మన్ రామారావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, హైమావతి, జ్యోతి, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, ప్రముఖ రచయిత్రిలు ఓల్గా, కొండవీటి సత్యవతి, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, ఆప్ నేత నమ్రత, తెలుగు మహిళా నేత శోభారాణి పాల్గొన్నారు. -
ఇలా చేస్తేనే బంగారు తెలంగాణ
జగద్గిరిగుట్ట: ప్రభుత్వాధినేతలు పదేపదే చెబుతున్నట్లు రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిపోవాలంటే తమ ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనన్నారు ఐద్వా నాయకురాళ్లు. కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్‌లో సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించడంతోపాటు మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నివారించగలిగినప్పుడే బంగారు తెలంగాణ వైపు అడుగులు పడినట్లని స్వరాజ్యం అన్నారు. మద్యం మహమ్మారిని తరిమేందుకు, మహిళలపై దాడులను నియంత్రించేందుకు ఐద్వా ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఉత్తమ గ్రామంగా ఉన్న గంగదేవరపల్లికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కనీసం అక్కడయినా జ్ఞానం తెచ్చుకుని ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు మద్యానికి బానిసై తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటున్నారని ఆవేదన చెందారు. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు కొత్తగా చీప్ లిక్కర్ విధానాన్ని తీసుకువచ్చి పేదలను మరింత పేదరికంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలల హక్కుల ఉద్యమకారిణి శాంతాసిన్హా, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్.ఆశాలత, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు కె.జ్యోతి, ఇందిర, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి సహా పలువురు మహిళలు హాజరయ్యారు.