సంస్కృతిని మంటగలుపుతున్న సీఎం
సంస్కృతిని మంటగలుపుతున్న సీఎం
Published Sun, Dec 4 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
– ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమాదేవి, ప్రభావతి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిపేందుకు బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి ఆరోపించారు. భోపాల్‌లో డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఐద్వా జాతీయ మహాసభలు విజయవంతం కోసం చేపట్టిన చేపట్టిన ఆలిండియా జాతా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కర్నూలుకు చేరుకుంది. జాతాలో వచ్చిన రాష్ట్ర నాయకులకు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సీక్యాంపు సెంటర్‌లో బహిరంగ సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్లను రద్దు చేసి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.నిర్మలమ్మ మాట్లాడుతూ..కర్నూలు జిల్లా కలెక్టర్ నియంతృత్వ పోకడలతో గోరుకల్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలివేలు, పి. నిర్మల, నగర అధ్యక్షురాలు ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement