మద్యాన్ని ఆపకపోతే మధ్యలోనే దించుతాం
ఐద్వా బస్సుయాత్ర ముగింపు సభలో కేసీఆర్‌కు నేతల హెచ్చరిక
హైదరాబాద్: పల్లెల్లో చీప్‌లిక్కర్ సరఫరా చేయాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మధ్యలోనే దించేస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. మద్యాన్ని నియంత్రించాలని, మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో 12 రోజులపాటు జరి గిన బస్సు యాత్ర ముగింపు సభ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరి గింది. సభ ప్రారంభానికి ముందు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిం చారు. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ కార్యదర్శి జగ్మమతి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్ది ఇబ్బందుల పాలు చేస్తున్నాయని విమర్శించారు. మహిళలు మద్యపాన నిషేధం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చా రు.
రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మద్యాన్ని అరికట్టడానికి బదులు ప్రజలకు మ రింత చేరువ చేయడం వల్ల సమాజంపై విపరీతమైన ప్రభావం చూపుతుందన్నారు. చౌకమద్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాం డ్ చేశారు. మద్యనిషేధ ఉద్యమ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ ఎవరైనా బాగా చదవాలని, బాగా పని చేయాలని ప్రోత్సహిస్తారని, కానీ, కేసీఆర్ అందరు బాగా తాగండంటూ ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ సారా వ్యతిరేక ఉద్యమం తో కాంగ్రెస్, మద్యనిషేధానికి తూట్లు పొడవడంతో టీడీపీలు ఓడిపోయాయని, చౌక మద్యా న్ని ఆపకపోతే ఈ ప్రభుత్వం కూడా మధ్యలోనే కూలిపోతుందన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా మద్యానికి వ్యతిరేకంగా సోదరులతో ప్రతిజ్ఞ చేయించుకొని రాఖీలు కట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజికవేత్త వసంత కన్నాబీరన్, చెరుకూరి గ్రూప్స్ చైర్మన్ రామారావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, హైమావతి, జ్యోతి, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, ప్రముఖ రచయిత్రిలు ఓల్గా, కొండవీటి సత్యవతి, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, ఆప్ నేత నమ్రత, తెలుగు మహిళా నేత శోభారాణి పాల్గొన్నారు.