
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసు విచారణ బెంచ్ నుంచి న్యాయమూర్తి సంజయ్ కుమార్ తప్పుకోవడంతో వాయిదా పడింది. దీంతో తదుపరి విచారణ జూలై 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఈ బెయిల్ పిటిషన్లను మరోబెంచ్ విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9వ తేదీన ఈడీ కస్టడీలోకి తీసుకుందిన. దీంతో ఆయన ఢిల్లీ కేబినెట్‌కు ఫిబ్రవరి 28న రాజీనామా చేశారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment