హైదరాబాద్: తెలంగాణలో ఎక్సైజ్ పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఖరారు చేశారు. ఈ మేరకు పాలసీ విధానాలను మీడియా ముందు కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీలు అమల్లోకి వస్తాయన్నారు. రెండేళ్ల కాలపరిమితి కోసం వైన్ షాపుల లైసెన్సులు ఇస్తామని.. రిటైల్ షాపుల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో లైసెన్సులు ఇస్తామని సీఎం కేసీఆర్ మీడియాతో వెల్లడించారు.