ప్రజల ఇబ్బందులు పట్టవా..? | idwa strikes sbi bank | Sakshi
Sakshi News home page

ప్రజల ఇబ్బందులు పట్టవా..?

Published Tue, Nov 15 2016 11:11 PM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM

ప్రజల ఇబ్బందులు పట్టవా..? - Sakshi

ప్రజల ఇబ్బందులు పట్టవా..?

అనంతపురం అగ్రికల్చర్‌ : పెద్ద నోట్లను రద్దు చేసి పేదల వర్గాలను ముప్పుతిప్పలు పెడుతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి బి.సావిత్రి విమర్శించారు. మంగళవారం సాయినగర్‌లోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రధానశాఖ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ... రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో విరివిగా రూ.100 నోట్లు అందుబాటులోకి తేకుండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. పెద్ద నోట్ల కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు.  నల్ల కుబేరులను ర„ìక్షిస్తూ పేద వర్గాల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement